Chicken Price: చికెన్ ప్రియులకు శుభవార్త. వారం వరకు ఆకాశాన్ని తాకిన ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. కిలో 250 రూపాయలకు వెళ్లిన చికెన్ ధరలు ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులోకి వస్తోంది. శనివారం నుంచే హైదరాబాద్‌తోపాటు ఏపీలోని కీలక నగరాల్లో ధరల తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
నాన్ వెజ్‌తో పండగ చేసుకోవడం తెలంగాణలో మెజార్టీ ప్రజల సంప్రదాయం. మాంసం వినియోగం ఏపీ, తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. కొద్ది నెలల కిందట నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వెల్లడించిన వివరాల మేరకు నాన్‌వెజ్ తీసుకునే రాష్ట్రాల్లో ఏపీ నాలుగు స్థానం కాగా, తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడి జనాబాలో 97 శాతం పైగానే మాంసాహారం తింటారన్నది ఆ సర్వే సారాంశం.
ఎండాకాలంలో చికెన్ ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. ఏ షాపుకి వెళ్లినా కేజీ 250 రూపాయలు పలికేంది. ఎందుకంటే పెళ్లిళ్లు సీజన్ కూడా అదే సమయంలో రావడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం సీజన్ మారడంతో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నుంచే హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో మాంసం దుకాణాల్లో ధరల తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ‘విత్ స్కిన్’ చికెన్ కిలో రూ. 173 ధర నడుస్తోంది. అదే స్కిన్ లెస్ రూ. 196గా ఉంది. కేవలం ఒక్కవారం వ్యవధిలో దాదాపు రూ.50 వరకు తగ్గింది. వాతావరణ పరిస్థితులు సహకరించడం, పౌల్ట్రీల సరఫరా పెరగడం ప్రధాన కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. వినియోగదారుల డిమాండ్ తగ్గడం ధరల తగ్గుముఖం పట్టడానికి కారణాలు చెబుతున్నారు ఆయా రంగాల నిపుణులు.
ALSO READ: నిద్రలో కనేది కల.. మేల్కొలిపేది కళ.. నా ఆకాంక్ష అదే
చికెన్ ధరలు తగ్గిన వార్త తెలియగానే ఆదివారం ఉదయం చికెన్ షాపుల ముందు వినియోగదారులు బారులు తీరారు. అన్ని జిల్లాల్లో ధరలు దాదాపుగా ఇదే మాదిరిగా ఉన్నాయి. విజయవాడలో స్కిన్ లెస్ రూ. 240 కాగా, విశాఖలో 260, బాపట్లలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ఆ లెక్కన ఏపీ కంటే తెలంగాణలో ధరలు తగ్గుముఖం పట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
హోల్‌సేల్-రిటైల్ షాపుల్లో చికెట్ ధరల్లో తేడాలు బాగానే కనిపిస్తున్నాయి. ప్రాంతం బట్టి ధరలు ఐదు నుంచి 10 రూపాయలు అటు ఇటు ధర పలుకుతోంది. కొన్ని షాపుల్లో అయితే శుభ్రత, ప్యాకేజింగ్ అంశాలపై ఆధారపడి ధరల తేడాలు ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో డజన్ గుడ్లు రూ. 72 ధర పలుకుతోంది. ధరలు కొన్ని చోట్ల అటు ఇటు మారుతున్నాయి. గుడ్డు ధర సుమారు ఆరు రూపాయలన్నమాట. చికెన్ తినడం ఆరోగ్యానికి లాభాలు లేకపోలేదు. ప్రోటీన్, ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.
అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు. ఆదివారం నాటికి చికెన్ ధరలు దిగి రావడం సానుకూల అంశమని అంటున్నారు. ఇక మటన్ గురించి చెప్పనక్కర్లేదు. కిలో 800 రూపాయల పైమాటే. ఏరియాను బట్టి ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి.