Seasonal Hair Fall: మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యంతో పాటు స్కిన్, జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. శీతాకాలపు పొడి వాతావరణం అయినా, వర్షాకాలంలో తేమ అయినా, వేసవికాలంలో వేడి అయినా, ప్రతి ఋతువులకూ దాని స్వంత సవాళ్లు ఉంటాయి. అందుకే మన జుట్టు ఏడాది పొడవునా ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా మారుతున్న సీజన్‌కు అనుగుణంగా హెయిర్ కేర్ పాటించడం చాలా ముఖ్యం. మారుతున్న వాతావరణంలో మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన 5 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీజన్ ప్రకారం మీ షాంపూ, కండిషనర్ వాడకం:
ప్రతి సీజన్ మీ తల చర్మం, జుట్టు మీద ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన షాంపూ, కండిషనర్‌ను మార్చడం ముఖ్యం. వేసవి కాలంలో తలపై వచ్చే చెమట, సహజ నూనె నుండి విముక్తి పొందడానికి తేలికైన , క్లిఫరింగ్ షాంపూని ఉపయోగించడం మంచిది. అంతే కాకుండా వర్షాకాలంలో యాంటీ-ఫ్రిజ్ , యాంటీ-హ్యూమిడిటీ షాంపూలు , కండిషనర్లు బాగా పనిచేస్తాయి. చలికాలంలో జుట్టుకు హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఉన్న షాంపూలు , కండిషనర్లను ఉపయోగించడం మంచిది.
పోషక నూనెతో తలకు మసాజ్ చేయండి:
రక్త ప్రసరణను పెంచడానికి, జుట్టు కుదుళ్లకు పోషణ అందించడానికి, అంతే కాకుండా కాలానుగుణంగా వచ్చే సమస్యలు చర్మం పొడిబారడం లేదా అదనపు నూనెలకు దూరంగా ఉంచడానికి కొబ్బరి నూనె, ఆర్గాన్ నూనె లేదా ఆముదం నూనెతో వారానికి ఒకసారి తలకు మసాజ్ చేయడం ముఖ్యం. వేసవి కాలంలో జోజోబా ఆయిల్ వంటి నూనెలను జుట్టుకు ఉపయోగించడం మంచిది. అదేవిధంగా చలికాలంలో ఆముదం లేదా ఆలివ్ వంటి ఆయిల్స్ కూడా జుట్టుకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఆయిల్ జుట్టుకు మసాజ్ చేయడానికి ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.
జుట్టుకు అలోవెరా:
వాతావరణంలో మార్పు కారణంగా, తలపై ఉండే చర్మం , జుట్టు యొక్క తేమ స్థాయి చాలా మారుతుంది. అందుకే ఈ తేమను తగ్గించడానికి అంతే కాకుండా జుట్టుకు రాలకుండా ఉండటానికి కనీసం వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్‌ను ఉపయోగించడం మంచిది. కలబంద, తేనె, పెరుగు, అవకాడో వంటి పదార్థాలు జుట్టుకు అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
రక్షణాత్మక స్టైలింగ్, కనిష్ట వేడి వినియోగం:
జుట్టును ఎక్కువగా స్టైలింగ్ చేయడం లేదా వివిధ రకాల హెయిర్ కేర్ పొడక్ట్స్ వాడకం వల్ల జుట్టు బలహీనపడుతుంది. అంతే కాకుండా వాతావరణ ప్రభావాలు జుట్టును పూర్తిగా ప్రభావితం చేస్తాయి. చెడు వాతావరణం నుండి మీ జుట్టును రక్షించుకోవడానికి మహిళలు వదులుగా ఉండే స్టైల్స్ వంటివి ఎంచుకోవడం మంచిది. జుట్టును వేడి చేసే పరికరాలను వీలైనంత తక్కువగా వాడండి.
Also Read: ప్రియాంక చోప్రా.. గ్లోయింగ్ స్కిన్ రహస్యం ఇదే !
ఆరోగ్యకరమైన జుట్టు లోపలి నుండి ప్రారంభమవుతుంది. అందుకే నీరు ఎక్కువగా తాగడం , బయోటిన్, విటమిన్ E, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు లోపలి నుండి పోషణ లభిస్తుంది.