Skin Care Tips: తెల్లగా, మెరిసే చర్మాన్ని పొందాలని కలలు కనే వారు ఇంట్లోని కొన్ని రకాల హోం రెమెడీస్ ప్రయత్నించడం చాలా మంచిది. రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్‌కు బదులుగా వీటిని వాడటం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కలబంద, నిమ్మకాయ అనేవి రెండు సహజ పదార్థాలు. ఇవి కలిసి మీ చర్మాన్ని శుభ్రంగా, మెరుస్తూ, ప్రకాశవంతంగా మారేలా చేస్తాయి. కలబంద , నిమ్మకాయలతో ఫేస్ మాస్క్ తయారు చేసుకుని వాడటం వల్ల ముఖం తెల్లగా మారుతుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం కలబంద, నిమ్మకాయలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద, నిమ్మకాయ ఫేస్ మాస్క్ యొక్క ప్రయోజనాలు:
చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తుంది.
కలబంద జెల్ 90% కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. ఇది చర్మానికి తగిన తేమను అందిస్తుంది. అంతే కాకుండా పొడిబారిన, నిర్జీవమైన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
మచ్చలను తేలికపరుస్తుంది:
నిమ్మకాయలో విటమిన్ సి, సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్ , టానింగ్ తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం యొక్క రంగు స్పష్టంగా, సమానంగా ఉంటుంది.
మొటిమలపై ప్రభావవంతంగా ఉంటుంది:
కలబందలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, నిమ్మకాయలో ఉండే ఆమ్ల అంశాలు మొటిమలను పొడిగా చేసి, కొత్త మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుతుంది.
చర్మానికి మెరుపు తెస్తుంది:
మీరు అలసిపోయిన చర్మంతో ఇబ్బంది పడుతుంటే.. కలబంద నిమ్మకాయ ఫేస్ మాస్క్ మీ చర్మానికి కొత్త జీవాన్ని తెస్తుంది. ఇది ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖానికి సహజమైన మెరుపును పెంచుతుంది.
తెరిచిన రంధ్రాలను బిగుతుగా చేస్తుంది:
కలబంద, నిమ్మకాయ రెండూ చర్మ రంధ్రాలను బిగించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా జిడ్డుగల చర్మ సమస్యను కూడా నియంత్రిస్తుంది.
కలబంద, నిమ్మకాయ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసి అప్లై చేయాలి ?
కావలసినవి:
-2 టీస్పూన్ల తాజా కలబంద జెల్
-1 టీస్పూన్ నిమ్మరసం
-1 కాటన్ బాల్ లేదా ఫేస్ బ్రష్
Also Read: ఈ చిన్న గింజలు.. అనేక రోగాలను నయం చేస్తాయ్ తెలుసా ?
ఎలా తయారు చేయాలి ?
-ఒక గిన్నెలో కలబంద జెల్, నిమ్మరసం బాగా కలపండి.
-ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి.
-తయారు చేసిన మిశ్రమాన్ని కాటన్ బాల్ లేదా బ్రష్ సహాయంతో ముఖం, మెడపై అప్లై చేయండి.
-15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
-మాస్క్ కొద్దిగా ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
-చివరగా తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
ముందు జాగ్రత్తలు:
1. నిమ్మకాయలో ఆమ్ల గుణాలు ఉంటాయి. కాబట్టి దానిని అప్లై చేసిన వెంటనే ఎండలో బయటకు వెళ్లకండి.
2. మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
3 . మీరు ఈ మాస్క్‌ను వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు.