Free Electricity Scheme: ఇంటింటికీ కరెంట్ బిల్లు వస్తే మనకు కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. రోజు రోజుకు రేట్లు పెరుగుతున్నాయి. విద్యుత్ వినియోగం పెరిగే వేసవి, వర్షాకాలాల్లో బిల్లు చూసి చాలా మంది తల పట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని రీతిలో ఆ రాష్ట్ర సీఎం, ప్రజల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వందకు పైగా యూనిట్లు వాడినా, మొదటి 125 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అదేంటి? ఏ రాష్ట్రం? ఎప్పుడు అమల్లోకి వస్తుంది? అన్ని వివరాలు మీ కోసమే!
సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం..
ఒక్కసారిగా జరిపిన ప్రెస్ మీట్లో సీఎం చెప్పిన మాటలు అక్కడున్న వారిని, టీవీల్లో చూసినవారిని ఆశ్చర్యపరచాయి. ప్రజల భారం తగ్గించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం మెరుగైంది. అందుకే ప్రజలకు దీన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని సీఎం అలా ప్రకటించేశారు. అర్ధం కాక తొలుత ఆశ్చర్యపోయిన వారు, తర్వాత ఖచ్చితంగా దీని ప్రయోజనం తెలుసుకుని సెలబ్రేషన్ మూడ్ కి వెళ్లిపోయారు.
ఏంటీ ఆ ఉచిత కరెంట్ స్కీమ్?
ప్రస్తుత ప్రకటన ప్రకారం, ప్రతి కుటుంబానికి నెలకు 125 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తారు. అంటే, మీ విద్యుత్ మీటర్ ఆ 125 యూనిట్ల కంటే తక్కువ చూపిస్తే, బిల్ శూన్యం. ఇక ఎక్కువ వచ్చినా.. మొదటి 125 యూనిట్ల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఈ స్కీమ్ ఇళ్లకు మాత్రమే పరిమితం, వాణిజ్య కస్టమర్‌లకు వర్తించదు. అన్నీ కలిపి చూస్తే, నెలకు రూ. 600 నుంచి రూ. 1000 వరకు ఆదా కానుందని అంచనా.
అమలు తేదీ? ముందే తలపెట్టుకోండి
ఈ పథకం 2025, ఆగస్టు 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. అంటే మీకు ఈ ప్రయోజనం వర్తించేందుకు జూలై నెలలో మీ వినియోగాన్ని గమనించండి. అవసరమైతే మీ ఫ్యాన్స్, ఫ్రిజ్, గీజర్ వాడకాన్ని తగ్గించుకుంటే.. పూర్తిగా ఉచిత కరెంట్ బెనిఫిట్ పొందొచ్చు. మరి దీన్ని పొందడానికి ఫామ్ లు, అప్లికేషన్ పద్ధతులు ఏమీ అవసరం లేదట. అటోమేటిక్‌గా మీ వినియోగ రికార్డు ఆధారంగా డిస్కౌంట్ వర్తించనుంది.
Also Read: Amaravati Hitec City: హైదరాబాద్ కు బిగ్ షాక్.. ఏపీలోనూ హైటెక్ సిటీ.. ఇక ఐటీ జాబ్స్ ఇక్కడే!
ఎవరికీ ఎంత లాభం?
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ. 8500 కోట్ల మేర భారం పడుతుంది. అయితే అదే సమయంలో ఇది కోట్లాది మందికి ఉపశమనం తీసుకొస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి, కింది మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఊరట. అంతేకాదు, ఇంకెంతమందో సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపకుండా నేరుగా ఈ స్కీమ్ ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటారు. అలాగే దీని వల్ల విద్యుత్ వినియోగం విషయంలో కొంత క్రమశిక్షణ కూడా రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయం కాదట.. ప్రజల కోసమే!
ఇదంతా ఒక ఎన్నికల స్టంట్ కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది మా ప్రభుత్వ విధానాల్లో భాగం. శాశ్వతంగా కొనసాగే పథకం. దీని వల్ల ఓట్లు ఆశించం. ప్రజల భారం తక్కువైతే మా ధ్యేయం నెరవేరినట్లేనని వ్యాఖ్యానించారు. అంతేకాక, ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ సమానంగా అమలు చేయనున్నట్టు స్పష్టంగా చెప్పారు.
ప్రజలు ఏమంటున్నారు?
సామాజిక మాధ్యమాల్లో ఈ నిర్ణయంపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత మంచి పథకాన్ని మేము ఊహించలేకపోయాం, మా కుటుంబానికి నిజంగా ఆదాయం పెరిగినట్టే, ఇప్పుడైనా ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధంగా ఆలోచించాలనే కామెంట్లతో సోషల్ మీడియాలో హుషారుగా చర్చ సాగుతోంది. ఈ ప్రకటన చేసింది మరెవరో కాదు.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. తాను ప్రజల కోసం కట్టుబడి ఉన్నానని మరోసారి చాటిచెప్పారు. ఉత్తర భారతంలోని ఒక వెనుకబడిన రాష్ట్రంగా పిలవబడే బీహార్.. ఇప్పుడు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది!