Curd For Hair Growth: పెరుగు దాదాపు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే ఆహార పదార్థం. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, లాక్టిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇంతకీ జుట్టు ఆరోగ్యం కోసం పెరుగును ఎలా ఉపయోగించాలో, దాని ప్రయోజనాలు, పెరుగుతో తయారు చేసుకునే కొన్ని సులభమైన హెయిర్ మాస్క్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు జుట్టుకు ఎలా సహాయపడుతుంది ?
పెరుగులో ఉండే ప్రోటీన్లు జుట్టు ఫోలికల్స్‌ను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. లాక్టిక్ యాసిడ్ తలపై చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రును కూడా నివారిస్తుంది. విటమిన్ B5, D వంటి పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పెరుగు తలపై చర్మం యొక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
పెరుగును జుట్టుకు ఉపయోగించే విధానాలు:
1.సాధారణ పెరుగు హెయిర్ మాస్క్:
కావలసినవి:
తాజా పెరుగు – 1 కప్పు
తాజా పెరుగును ఒక గిన్నెలో తీసుకోండి. దీనిని తల చర్మం, జుట్టు మొత్తం మీద సమానంగా పట్టించండి. తర్వాత 20-30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేయండి. ఈ హెయిర్ మాస్క్ జుట్టును మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా తలపై చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
2. పెరుగు, తేనెతో మాస్క్:
కావలసినవి:
పెరుగు – 1/2 కప్పు
తేనె – 2 టీస్పూన్లు
తయారీ విధానం:
పెరుగు, తేనెను బాగా కలిపి మృదువైన మిశ్రమం తయారు చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుపై అప్లై చేయండి.
అనంతరం 30 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. తేనె జుట్టుకు తేమను అందిస్తుంది . అంతే కాకుండా జుట్టు ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.
3. పెరుగు, నిమ్మరసం మాస్క్:
కావలసినవి:
పెరుగు – 1/2 కప్పు
నిమ్మరసం – 1 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా పెరుగులో నిమ్మరసం కలిపి, బాగా మిక్స్ చేయండి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుపై అప్లై చేసి.. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయండి. నిమ్మరసం చుండ్రును తొలగిస్తుంది. అంతే కాకుండా తలపై చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
4.పెరుగు, ఎగ్ మాస్క్:
కావలసినవి:
పెరుగు – 1/2 కప్పు
ఎగ్ – 1
Also Read: మహిళల్లో.. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలివేనట!
తయారీ విధానం:
ముందుగా గుడ్డును పగలగొట్టి, పెరుగులో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తల చర్మంపై అప్లై చేసి.. 20 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేయండి. గుడ్డులోని ప్రోటీన్లు జుట్టు ఫోలికల్స్‌ను బలోపేతం చేస్తాయి.
తాజా పెరుగును మాత్రమే హెయిర్ మాస్క్‌ల కోసం ఉపయోగించండి. ఎందుకంటే ఎక్కువ సేపు నిల్వ ఉంచిన పెరుగు తల చర్మంపై ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు.
అలర్జీ టెస్ట్: ఏదైనా కొత్త మాస్క్‌ను ఉపయోగించే ముందు, చర్మంపై చిన్న భాగంలో పరీక్షించండి.