Hair Loss In Females: వేసవిలో దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కొన్నిసార్లు విటమిన్లు తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలడం పెరుగుతుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి తప్పకుండా ప్రతి రోజు ఎండలో కూర్చోవాలి. దీంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు.
సమ్మర్ సీజన్ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడితే.. ఇది మన చర్మానికి, జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. సమ్మర్‌లో దుమ్ము, చెమట, కాలుష్యం కారణంగా చర్మం రంగు పాలిపోతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం.. జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. వయస్సు పెరిగే కొద్దీ జుట్టు రాలడం జరుగుతుంటే అది వయసు పెరుగుతున్నదానికి సంకేతం. కానీ చాలా మంది చిన్న వయసులోనే జుట్టు రాలుతుందని చెబుతున్నారు. దీని కోసం.. మార్కెట్ నుండి అనేక రకాల ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి ఎలాంటి ప్రయోజనాలను అందించవు.
ఇదిలా ఉంటే కొన్నిసార్లు విటమిన్లు లేకపోవడం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ రోజు మనం ఏ విటమిన్ల లోపం వల్ల ఇలా జరుగుతుందో ? ఈ లోపాన్ని తీర్చడానికి మనం ఏమి తినాలో తెలుసుకుందాం.
విటమిన్ డి:
దీనిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు. జుట్టు పొడవుగా, మందంగా ఉండటంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపిస్తే తల చర్మం బలహీనంగా మారుతుంది. దీని కారణంగా.. జుట్టు రాలడం సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే తప్పకుండా మీరు ఉదయం పూట ఎండలో కూర్చోండి. అంతే కాకుండా మీరు తినే ఆహారంలో ఎగ్, పాలు లేదా చేపల వంటి వాటిని కూడా చేర్చుకోండి.
విటమిన్ బి7 (బయోటిన్):
ఇది జుట్టు పెరుగుదలకు చాలా అవసరమైన విటమిన్ . విటమిన్ బి 7 జుట్టును మెరిసేలా ఉంచుతుంది. అంతే కాకుండా ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. దీనివల్ల జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి మీరు గుడ్లు, సీడ్స్, సోయా లేదా తృణధాన్యాలు తినడం ప్రారంభించాలి.
విటమిన్ బి12:
విటమిన్ బి12 రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది . దీని వల్ల.. ఆక్సిజన్ , పోషకాలు తలపై చర్మానికి చేరతాయి. కానీ వాటి లోపం వల్ల జుట్టు యొక్క కుదుళ్లు కూడా బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, నాన్ వెజ్ తినడం వల్ల ఈ విటమిన్ లోపం నుండి ఈజీగా బయటపడొచ్చు.
విటమిన్ ఇ:
విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది తలపై చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరం అయిన పోషణను అందిస్తుంది. దీని లోపం వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా కూడా మారుతుంది. దీని కారణంగా.. జుట్టు రాలడం సర్వసాధారణం అవుతుంది. దీని కోసం.. మీరు మీ ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, వేరుశనగలు, అవకాడోలను తప్పనిసరిగా తినాలి.
Also Read: ముఖంపై మొటిమలా ? కారణాలేంటో తెలుసుకోండి !
విటమిన్ ఎ :
మీ శరీరంలో విటమిన్ ఎ లోపం ఉంటే జుట్టు రాలడం సహజం. నిజానికి ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అయితే.. దీని లోపం , అధిక మోతాదు రెండూ జుట్టుకు హానికరం. మీరు మీ ఆహారంలో క్యారెట్లు, చిలగడదుంపలు, పాలు తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల మాత్రమే జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా మీకు విటమిన్ తగిన మోతాదులో కూడా లభిస్తుంది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు విటమిన్ ఎ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.