BigTV English

Gali Kireeti Reddy : సీనియర్ అవ్వాలంటే… ఈ ‘జూనియర్’ ఇంకా చాలా నేర్చుకోవాలి

Gali Kireeti Reddy : సీనియర్ అవ్వాలంటే… ఈ ‘జూనియర్’ ఇంకా చాలా నేర్చుకోవాలి
Advertisement

Gali Kireeti Reddy : వివాదాస్పద వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా రాబోతున్నాడు. ఆయన హీరోగా చేస్తున్న జూనియర్ మూవీ జూలై 18న థియేటర్స్ లోకి రాబోతుంది. రావడం అయితే ఈ జూలైలో వస్తుంది.. కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.


ఈ మూవీ సరిగ్గా 4 సంవత్సరాల కిందట స్టార్ట్ అయింది. అప్పటి నుంచి షూటింగే వాయిదా పడుతూ పడుతూ వచ్చింది. ఈ వాయిదాలకు కారణం మన జూనియర్ బాబు కిరీటి రెడ్డినే అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.

గాలి జనార్దన్ రెడ్డి.. ఈయన గురించి, ఆయన ఆస్తుల గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. అలాంటి బడా వ్యాపార వేత్త తన వారసుడిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాడు. కిరీటి రెడ్డికి కూడా సిల్వర్ స్క్రిన్ పై మెరవాలి అనే కోరిక కూడా ఉందట. అలా… గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీకి రాబోతున్నాడు.


4 ఏళ్ల క్రితం స్టార్ట్…

4 ఏళ్ల క్రితం జూనియర్ అనే మూవీని స్టార్ట్ చేశారు. దీనికి హీరో కిరీటి రెడ్డి అయితే, హీరోయిన్ శ్రీలీల. శ్రీలీల సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే. అలాగే ఈ సినిమాను వారాహీ ఫిల్మ్స్ బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్ గా సాయి కొర్రపాటి ఉన్నా.. బ్యాక్ ఎండ్‌లో నడిపించే వాళ్లు బడా వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి నే అని ఓ టాక్ ఉంది.

వాయిదాకు కారణం కిరీటి రెడ్డినే..?

దీని సంగతి పక్కన పెడితే… జూనియర్ సినిమా షూటింగ్ ఇలా నాలుగేళ్లు వాయిదా పడటానికి మెయిన్ రీజన్ హీరోగారేనట. హీరో గారు సెట్స్ రావడం అంటే… ఓ అద్భతమైన విషయం అంట. వచ్చినా… సాయంత్రం 4 గంటలకు అలా వచ్చి ఓ షాట్ షూటింగ్ పూర్తి చేసి… రెస్ట కావాలి అంటూ వెళ్లిపోతారట.

సాదారణంగా షూటింగ్స్ అనేవి మార్నింగ్ 6 నుంచి 7 గంటల మధ్య స్టార్ట్ అవుతాయి. (నైట్ షూటింగ్స్ కాకుండా) అయితే మార్నింగ్ 6 గంటలకు షూటింగ్ స్టార్ట్ అయినా… బాబు గారు సాయంత్రం 4 గంటలకే వస్తారట. 4 గంటలకు వచ్చి డైరెక్టర్ తో డైలాగ్స్ చెప్పించుకుని అతి కష్టం మీద ఓ షాట్ పూర్తి చేసి మళ్లీ ఇంటి దారి పట్టేస్తాడట. అంటే… రోజుకు కిరీటి బాబు గారు తన సినిమా కోసం కేటాయించే టైం అంటే గంట నుంచి 2 గంటల లోపే అని ఇండస్ట్రీలో ఈ టాక్ ఉంది.

సీనియర్స్ కంటే ఈ జూనియర్ వల్ల టైం వేస్ట్..?

ఆయన చేస్తున్న ఆ జూనియర్ మూవీలో చాలా మంది సీనియర్స్ నటీనటులు ఉన్నారట. ఎంతో అనుభవం ఉన్న వాళ్లూ ఉన్నారట. కానీ, వారు అందరూ టైం టూ టైం ఉంటారట. కానీ, మన జూనియర్ బాబు మాత్రం సాయంత్రం 4 అవ్వకుండా… సెట్స్ లో అడుగు పెట్టేదేలేదని సమాచారం.

భారీగా పెరిగిన బడ్జెట్..?

ఈ జూనియర్ స్టార్ ఇలా చేయడం వల్ల అనుకున్న బడ్జెట్ కంటే… 10 శాతం బడ్జెట్ పెరిగిందట. ఎలాగు రిచ్ కిడ్ కాబట్టి.. డబ్బులు గురించి పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. కానీ, అక్కడ కాస్ట్ అండ్ క్రూ అందరికీ 4 ఏళ్ల పాటు టైం వేస్ట్ అవుతున్నట్టే కదా.. అని ఇండస్ట్రీ ప్రముఖులు లోలోపల అంటున్నారట.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×