Hibiscus For Hair Growth: మందార పువ్వులు, ఆకులు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సహాయపడతాయి.అంతే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు, తెల్లజుట్టు వంటి సమస్యలను నివారిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మందార పూలు, ఆకులను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదల కోసం మందారను ఎలా ఉపయోగించాలి ?
1.మందార హెయిర్ ఆయిల్:
ముందుగా 8-10 మందార ఆకులు , 3 మందార పువ్వులను శుభ్రంగా కడిగి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని, సన్నని మంటపై వేడి చేయాలి. నూనె వేడెక్కాక, దానికి ముందుగా తయారు మందార పేస్ట్‌ను కలిపి నెమ్మదిగా మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత.. దానిని వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఎలా వాడాలి ?
ఈ నూనెను వారానికి 2-3 సార్లు రాత్రి పడుకునే ముందు తలకు, జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. మందార హెయిర్ మాస్క్‌లు:
మందార & పెరుగు మాస్క్: గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగును తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టును మృదువుగా చేసి.. బలాన్ని ఇస్తుంది.
మందార & ఉసిరి మాస్క్: కొన్ని మందార ఆకులు, పూలను పొడి చేసి, దానికి ఉసిరి పొడిని కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుకు, తలకు అప్లై చేసి 45 నిమిషాల పాటు ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టును బలోపేతం చేసి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
మందార & అల్లం రసం: అల్లం రసం, మందార పూల పొడిని మెత్తని పేస్ట్‌లా కలుపుకుని తలకు అప్లై చేయాలి. అరగంట పాటు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
3. మందారతో షాంపూ:
కొన్ని మందార పువ్వులు, ఆకులను నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి, సాధారణంగా తలస్నానం చేసిన తర్వాత చివరి రిన్స్‌గా ఉపయోగించవచ్చు. ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.
కొన్ని మందార పువ్వులు, ఆకులను మెత్తగా చేసి.. దానికి కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు ముఖ్యంగా కుదుళ్లకు పట్టించి 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది సహజమైన షాంపూగా పనిచేస్తుంది.
Also Read: హోం మేడ్ హెయిర్ కలర్.. ఇది వాడితే జీవితంలో తెల్ల జుట్టు రాదు
మందార జుట్టు పెరుగుదలకు ఎలా సహాయపడుతుంది ?
జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది: మందారలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
రక్త ప్రసరణను పెంచుతుంది: మందార తల భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు తగినంత పోషకాలు అంది, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
చుండ్రును నివారిస్తుంది: మందారంలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా తలలోని చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
సహజమైన కండీషనర్: మందారం జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది.
తెల్ల జుట్టును తగ్గిస్తుంది: మందారం క్రమం తప్పకుండా వాడటం వల్ల తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.