Nagarjuna Remuneration : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) ఈమధ్య ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈయన తోటి స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ(Balakrishna ), వెంకటేష్(Venkatesh ), చిరంజీవి(Chiranjeevi ) వరుస పెట్టి హీరోలుగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటుంటే.. నాగార్జున మాత్రం ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడం చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నాగార్జున సోలోగా ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే హీరోగా కథలను పరిశీలించకపోగా.. కనీసం క్యారెట్ ఆర్టిస్టు పాత్రలతోనైనా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది.
కుబేర మూవీలో నాగ్ పాత్రకు ప్రయారిటీ లేనట్టేనా?
ముఖ్యంగా రెమ్యునరేషన్ కి ఆశపడి.. పాత్ర ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించకపోవడంతో అభిమానులు కూడా కాస్త పెదవి విరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) తెలుగులో చేసిన చిత్రం ‘కుబేర’. ఈ సినిమా నేడు తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో విడుదలైంది. ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషించారు. నిజానికి ఈ సినిమాలో నాగార్జునకు బలమైన పాత్ర పడింది. కానీ ఆ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం గమనార్హం.. దీనికి తోడు ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషించినప్పటికీ.. కథ మొత్తం విలన్, హీరో పాత్రకు తగ్గట్టుగానే డిజైన్ చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ నాగార్జున పాత్రకు ప్రయారిటీ జీరో అనడంలో సందేహం లేదు.
రెమ్యునరేషన్ కోసం నాగార్జున ఆశపడ్డారా?
సాధారణంగా నాగార్జున హీరోగా సినిమా చేస్తే.. డిమాండ్ ను బట్టి రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కానీ ఈ సినిమాకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకే రూ.20 కోట్లు ఇస్తామని చెప్పేసరికి, తన క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్ వల్ల తన కెరియర్ పై ఇంపాక్ట్ పడుతుందా? లేదా? అని ఏమీ ఆలోచించకుండా ఒకే చెప్పడం ఇప్పుడు అతిపెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా రెమ్యూనరేషన్ కోసం కక్కుర్తి పడి.. స్టేటస్ ను తగ్గించుకుంటున్నాడేమో అని ఫ్యాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఈ పాత్ర నాగార్జునకు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పవచ్చు.
నాగార్జున సినిమాలు..
ఇక ప్రస్తుతం నాగార్జున రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈయన లుక్ కి సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల అయ్యాయి. ఆ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాలో తన పాత్రతోనైనా ప్రేక్షకులను మెప్పిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా నాగార్జునకు ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు సెట్ కావని, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేదా మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తే మళ్లీ గట్టి కంబ్యాక్ ఇస్తారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి నాగార్జున ఇకనైనా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారేమో చూడాలి.
ALSO READ:Sandeep Reddy Vanga: ఖరీదైన కారు కొన్న స్పిరిట్ డైరెక్టర్.. ఖరీదు, ఫీచర్స్ తెలిస్తే షాక్..!