Kuberaa North Result: శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో ధనుష్(Danush) రష్మిక (Rashmika)హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా (Kuberaa Movie)జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు తెలుగు తమిళం నుంచి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. మరి హిందీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది ?ఉత్తరాదిలో కుబేర టాక్ ఎలా ఉందనే విషయానికి వస్తే…
ధనుష్ నటన..
దేవా పాత్రలో బిచ్చగాడిగా నటించిన ధనుష్ నటన పట్ల ఉత్తరాది ప్రేక్షకులు పెద్ద ఎత్తున ప్రశంసల కురిపిస్తూ ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ధనుష్ కెరియర్ లోనే దేవా పాత్ర ది బెస్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక బిచ్చగాడిలా నటించడం ఎంతో కష్టతరమైన విషయం కానీ ,ధనుష్ మాత్రం ఆ పాత్రలో లీనమయ్యారని, ఆయన బిచ్చగాడిలా ఎమోషనల్ అవుతూ నటించిన తీరు అందరిని ఆకట్టుకుందని తెలియజేస్తున్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయారని చెప్పాలి.
దేవిశ్రీ మ్యూజిక్…
ఇక ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన నటుడు నాగార్జున, రష్మిక మందన్న పాత్రలపై కూడా ఉత్తరాది ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాలని ముఖ్యంగా కొన్ని సన్నివేశాలకు ఈయన అందించిన బిజిఎం హైలెట్ గా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. కొన్ని పాటలు మాత్రం చాలా స్లోగా కొనసాగుతున్నట్టు తెలిపారు.
రన్ టైం..
ఈ సినిమా దాదాపు 3 గంటల 13 నిమిషాలు ఉంది అయితే ఇంత నిడివి ఉంటే ప్రేక్షకులు అంతసేపు కూర్చొని థియేటర్లలో సినిమా చూడలేరు. ఈ విషయం గురించి మన తెలుగు రాష్ట్రాలలో కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఉత్తరాదిలో కూడా ఈ సినిమా నిడివి మూడు గంటల పైగా ఉండటం కాస్త ప్రేక్షకుల సహనానికి పరీక్ష గానే భావిస్తున్నారు. సెకండ్ హాఫ్ లో కథ కూడా స్లోగా సాగటం, ఇక హిందీ డబ్బింగ్ లో కొన్ని లిప్ సింక్ కాలేదనే అభిప్రాయాలను తెలుపుతున్నారు.
సోషల్ మీడియా బజ్…
కుబేర సినిమాకు హిందీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. చిన్నచిన్న లోటుపాట్లు ఉన్న ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా. ఎంతో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి అనుభూతి కలుగ చేస్తుందని తెలియజేస్తున్నారు. ఇకపోతే ఢిల్లీ ముంబై వంటి మహానగరాలలో థియేటర్లు మొత్తం నిండిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ అలాగే సినిమా నిడివి మాత్రమే చిత్రానికి మైనస్ గా మారినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఎంతో మంచి ఆదరణ రాబడుతుందని చెప్పాలి.
Also Read: నా బిడ్డకు అనారోగ్యం.. ప్లీజ్ బెయిల్ ఇవ్వండి.. అభ్యర్థించిన శ్రీరామ్!