Relationship Tips :బయట మనకు ఎందరితో ఎన్నో గొడవలు ఉండవచ్చు. కానీ ఇంట్లో భార్యతో ఉండే గొడవల తీరు వేరు. అవి నెక్స్ట్ లెవెల్. వాటితో ఏ గొడవల్ని అసలు పోటీ చూడలేం. ఎందుకంటే వాటిని మనం అంతగా మైండ్‌కి తీసుకోలేం. అలాగని ఇగ్నోర్ చేయలేము.
మరి అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ‘నేనెందుకు వాళ్ల అమ్మ ఉంటె చాలు’ అంటూ భార్య అలగడం మీ లైఫ్‌లోనూ జరిగిందా? ఈ గోలంతా ఏంట్రా బాబోయ్ అంటూ ఎప్పుడైనా తల పట్టుకున్నారా? పట్టుకునే ఉంటారు లెండి.
అందుకే అలా జరగకుండా అసలు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయో, అవి ఎలా టర్న్ తీసుకుంటాయో ఒకసారి చూసేద్దాం.
ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే.. దేన్నైనా అమ్మని అడిగి డెసిషన్ తీసుకోవడం ఇకనుంచి మానేయండి. అది టీవీ అయినా, బయటికి ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఆఖరికి చిన్న పిల్లలకు ఏమైనా బట్టలు కొనాలన్నా.. డైరెక్ట్‌గా వెళ్లి అమ్మని అడిగే కంటే ముందు ఒకసారి మీ భార్యని అడిగి చూడండి.
అలా కాకుండా అమ్మ దగ్గరికి వెళ్లి అడిగితే.. ‘ఇంకా ఇంట్లో నాకున్న విలువ ఏంటి?’ అన్న ఆలోచన భార్యకి రావచ్చు. ఆ ఆలోచన తర్వాత పెద్ద గొడవ తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక మరొకటి.. మీ అమ్మతో ఆ అమ్మాయిని పోల్చి చూడకూడదు. ఎందుకంటే వయసులో, అనుభవంలో అమ్మ చాలా పెద్దది. ఎన్నో చూసి ఉంటుంది. కానీ భార్య అప్పుడే తన అల్లారు ముద్దుగా పెరిగిన ఇంటి నుంచి మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతోంది.ఇక్కడ నువ్వు తప్ప ఆమెకి మరెవరు అంత దగ్గరగా ఉండలేరు. సో.. ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ వాతావరణం ఆమెకు అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది.
భార్యను అజమాయిషీ చేస్తున్నారనే ఫీలింగ్ రాకుండా చూడండిఆమె మనసును అర్థం చేసుకోకుండా ‘మా అమ్మ చెప్పినట్టే వినాలి.. చెప్పిందే చేయాలి’ అంటే ఆమెకి తనని అజమాయిషీ చేస్తున్నారా అన్న ఆలోచన రావచ్చు.
ఇక మరొకటి.. భార్య ఏదైనా సలహా ఇస్తే అది నచ్చకపోయినా ముందుగా నచ్చలేదు అనే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం అస్సలు చేయకండి.ఎందుకంటే ‘అసలు నా మాటకి ఇక్కడ విలువేమీ లేదు’ అని ఆమె అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె ఇచ్చిన సలహాలను మొదటగా వినడం నేర్చుకోండి.భార్య ముందే అమ్మ మాటకు అడ్డంగా తల ఊపొద్దు ఇక ఆమె ముందే అమ్మ ఏం చెప్పినా అడ్డంగా తల ఊపితే.. ఆమెకి కోపం నషాలానికి ఎక్కడం ఖాయం. సో.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బెడ్‌రూంలో ఏం గొడవలు జరిగినా దాన్ని బయటకు రాకుండా చూసుకోండి.ఎందుకంటే ఏ ఇంట్లో అయినా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ జరిగిన ప్రతిదీ వెళ్లి పూసగుచ్చినట్టు అమ్మకు చెబితే భార్య మనసు గాయపడుతుంది.ఆమె ప్రైవసీని కచ్చితంగా మనం గౌరవించాలి. ముఖ్యంగా ఏ ఇద్దరు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చినా అది ఇద్దరికీ మంచిది కాదు.
ఇక మరో విషయం ఏంటంటే.. భార్య ఎప్పుడైనా తన బాధని చెప్పుకోవడానికి దగ్గరగా వస్తే దగ్గరికి తీసుకోండి. అంతేతప్ప ‘నువ్వు అమ్మను గౌరవించట్లేదు.. చెప్పిన పని చేయట్లేదు.. అసలు మా అమ్మంటే నీకు ఇష్టమేనా?’ అంటూ ఇలాంటి సూటిపోటి మాటలతో గుచ్చితే ఆ బంధం మరింత బీటలు వేస్తుంది.సో.. ఓపికగా ముందు చెప్పింది వినండి. అలా అలా ఓపిక లేకపోతే కొత్త సమస్యలకు దారి తీసినట్టే.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అమ్మకి, భార్యకి అస్సలు పోల్చకూడదు. ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ పెట్టకూడదు.ఎందుకంటే అమ్మ స్థానాన్ని భార్య భర్తీ చేయలేదు. భార్య స్థానాన్ని అమ్మ భర్తీ చేయలేదు. సో.. ఇద్దరి మధ్య బ్యాలెన్స్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. ఎటువైపు బెండ్ అయినా మీ బెండ్ తీయడం పక్క.
ఓపిక అనేది బంధంలో చాలా ముఖ్యం. తమరు ముఖ్యమైనది ఏంటంటే.. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమ్మతోనే కాదు.. భార్యతో చర్చించండి.అలా గనుక చేస్తే ‘నాకు నా భర్త ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు’ అంటూ సంతోషపడుతుంది భార్య. అలా కాకుండా భార్యని పట్టించుకోకుండా అమ్మని మాత్రమే అడిగితే భార్య హర్ట్ అవడం ఖాయం.
also read :రీల్స్ చూస్తున్నారా..? అయితే ఇది ఒక్కసారి చదవండి
సో.. చివరిగా ఏంటంటే.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంసారం అనే బండిని సజావుగా నడిపించాలి. అప్పుడే ఈ బంధం.. ఏ బంధమైనా.. అప్పుడే వివాహిక బంధం పదేళ్ల కాలంపాటు పచ్చగా ఉంటుంది.