E-Paper
Advertisement

కారు కాదు.. డ్రోన్ కాదు.. ఇదో ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్.. వారెవ్వా భలే ఉందే!

కారు కాదు.. డ్రోన్ కాదు.. ఇదో ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్.. వారెవ్వా భలే ఉందే!
Advertisement

Uttarakhand Flying Electric Vehicle Goes Viral: ఉత్తరాఖండ్‌లో ఓ యువకుడు తయారు చేసిన ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్మోరా జిల్లాలోని కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన ఇన్నోవేటర్ రవి తమ్తా, తన స్టార్టప్ ‘హపిడా స్కై’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ ను ప్రయోగాత్మకంగా నడిపించారు.  హపిడా స్కై నెక్స్  పేరుతో రూపొందించిన ఈ వెహికల్ కు సంబంధించిన తొలి వెహికల్ ప్రయోగం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డ్రోన్ టెక్నాలజీతో తయారీ

ఈ వెహికల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ విమానంలా కాకుండా డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. ఒక వ్యక్తిని గాల్లోకి తీసుకెళ్లేలా దీనిని తయారు చేశారు. ప్రస్తుతం ఇది పూర్తిస్థాయి కమర్షియల్ వెహికల్ కాకుండా ప్రయోగ దశలో ఉన్న ప్రోటో టైప్ మాత్రమే.

కొండ ప్రాంతాల రవాణా సమస్యకు పరిష్కారం

Advertisement

రవి తమ్తా ఆలోచన వెనుక ప్రధాన కారణం ఉత్తరాఖండ్‌ లోని పర్వత ప్రాంతాల్లో ఎదురయ్యే రవాణా సమస్యలు. కొండ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే రోడ్డు మార్గంలో ఎక్కువ సమయం పడుతుంది. తమ గ్రామం నుంచి తన ఇంటికి వెళ్లేందుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, రోడ్డు మార్గంలో దీనికి దాదాపు గంటన్నర సమయం పడుతుందని తమ్తా చెబుతున్నారు. అదే దూరాన్ని ఫ్లయింగ్ వెహికల్ తో సుమారు 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. అల్మోరాలో ఈ వెహికల్ కు సంబంధించి ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించారు. రవి తమ్తా, ఆయన బృందం వాహనం గాల్లోకి ఎగరడం, బ్యాలెన్స్ ను కాపాడుకోవడం, ముందుకు కదలడం లాంటి పలు  అంశాలను పరిశీలించారు.

డ్రోన్ నుంచి ఎగిరే వెహికల్ వరకు

హపిడా స్కై నెక్స్‌ ను పూర్తిగా విద్యుత్‌ తో పనిచేసే పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న డ్రోన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి, ఒక వ్యక్తిని మోసుకెళ్లే స్థాయికి తీసుకురావడానికి తమ టీమ్ ప్రయోగాలు చేస్తోందని తమ్తా వెల్లడించారు. ప్రస్తుతం కనిపిస్తున్న మోడల్ కాంపాక్ట్ మల్టీ రోటర్ డిజైన్‌ ను కలిగి ఉంది. సింగిల్ సీట్ నిర్మాణం కారణంగా తొలి దశలో వెహికల్ కంట్రోల్, స్టెబులిటీ లాంటి అంశాలను పరీక్షించడం ఈజీగా ఉంటుందన్నారు. అయితే ఈ వాహనానికి సంబంధించిన పూర్తి టెక్నికల్ వివరాలు వెల్లడించలేదు. బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంతసేపు ప్రయాణిస్తుంది? గరిష్ఠ వేగం, ఎంత బరువు మోస్తుంది? అనే విషయాలు చెప్పలేదు.

ఇప్పుడే రోడ్డుపైకి కాదు!

Advertisement

ఈ వెహికల్ ఫస్ట్ టెస్ట్ లో సక్సెస్ కావడంతో ప్రాజెక్ట్‌ కు ముఖ్యమైన ముందడుగు అయినప్పటికీ, హపిడా స్కైనెక్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఈ వెహికల్ ఎలా పనిచేస్తుంది?  ఎంత స్థిరంగా ఉంటుంది? అత్యవసర పరిస్థితుల్లో దాని పనితీరు ఎలా ఉంటుంది? అనే అంశాలపై మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తొలి ప్రయోగానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ పై ఆసక్తి పెరిగింది.

Read Also: 8 దశాబ్దాలకు ఊళ్లోకి అడుగు పెట్టిన బస్సు.. డప్పు దరువులతో స్వాగతం పలికి గ్రామస్తులు!

Tags

Related News

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×