Weight Loss Mistakes: నేడు చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినప్పటికీ బరువు తగ్గరు. ఇందుకు గల కారణాలు చాలానే ఉంటాయి. బరువు తగ్గకపోవడానికి గల కారణాలతో పాటు ఎలాంటి చిట్కాలు పాటిస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గకపోవడానికి గల కారణాలు :
థైరాయిడ్ :
థైరాయిడ్ హార్మోన్ శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. అంతే కాకుండా ఇది మీ శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది. హైఫోథైరాయిడిజం కూడా జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గడం కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
అధిక కేలరీలు:
బరువు తగ్గాలంటే ముందుగా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం చాలా ముఖ్యం. అంతే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా అవసరం. బరువు తగ్గాలని అనుకునే వారు తినే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. కేలరీలను లెక్కించడానికి యాప్ ఉపయోగించండి. తద్వారా సరైన మొత్తంలో మీరు కేలరీలను తగ్గించుకోవచ్చు.
నిద్ర:
బరువు తగ్గడంలో నిద్ర కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా నిద్ర రానప్పుడు దాని ప్రభావం కూడా మీ శరీరంతో పాటు ముఖంపై కూడా ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే కూడా బరువు తగ్గుతారు. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం తగినంత నిద్ర పోవడం అలవాటు చేసుకోండి.
వ్యాయామం:
వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకే రకమైన వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడానికి అంతగా అవకాశాలు ఉండవు. అందుకే ఒకే రకమైన వ్యాయామంతో పాటు, ఒకే వ్యాయామాన్ని ఎక్కువ సేపు చేయకండి. ఇవే కాకుండా కార్డియో, వెయిట్ ట్రైనింగ్ తో పాటు యోగా చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు.
Also Read: షుగర్ ఉన్న వారికి ఈ పండ్లు వరం, ఎక్కడ దొరికినా వదలొద్దు !
ఇన్సులిన్ హార్మోన్ :
మన శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఇది శరీరంలో అదనపు గ్లూకోజ్‌ను కొవ్వుగా నిల్వ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ల అసమతుల్యత కూడా ఇన్సులిన్ నిరోధకతలకు కారణం అవుతుంది. ఇది తరచుగా టైప్ – 2 డయాబెటిస్ లో కనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది.
ఒత్తిడి:
ప్రస్తుతం చాలా మంది ఒత్తడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒత్తిడి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడి వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఫలితంగా ఆహారం ఎక్కువగా తినడం, హార్మోన్ల అసమతుల్యత , కోపం, చికాకు అసహనం వంటివి ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల కూడా తాత్కాలికంగా బరువు పెరగవచ్చు. ఇలాంటి సమయంలోనే వెంటనే డాక్టర్లు సంప్రదించడం చాలా ముఖ్యం.