E-Paper
Advertisement

విజయవాడలో బోండా ఉమ హల్‌చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!

విజయవాడలో బోండా ఉమ హల్‌చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!
Advertisement

Bonda Uma: రాజకీయాల్లో ఒక్క మాట.. ఒక్క అడుగు.. ఒక్క కలయిక ఎన్నో మలుపులకు దారి తీస్తుంది. ముద్రగడ సంతాప సభకు బొండా ఉమ వెళ్లినప్పుడు అదే జరిగింది. కాపు అంశంపై ఆయన చేసిన స్టేట్‌మెంట్స్, అంబటితో ఆత్మీయ ఆలింగనం సొంత పార్టీలోనే దుమారం రేపాయి. దీనికి వైసీపీ వత్తాసు పలకడంతో బొండాపై అధిష్టానానికి ఎక్కడిలేనంత కోపం వచ్చింది. చివరకు హైకమాండ్‌ పిలిచి మరీ వివరణ అడిగింది.

మల్లాది విష్ణు చేస్తున్న దీక్ష..

బొండా ఉమ క్లారిటీ ఇచ్చినా ఆయన ఇమేజ్‌కి పార్టీలో ఫుల్‌ డ్యామేజ్ అయ్యింది. ఈ డ్యామేజ్‌ను కవర్‌ చేసుకునే చాన్స్ మల్లాది విష్ణు రూపంలో వచ్చింది. ఇంకేముంది ఇమేజ్ బిల్డింగ్ ఆపరేషన్ షురూ చేశారు.మెగా డీఎస్సీ అంశంపై మల్లాది విష్ణు చేస్తున్న దీక్ష వేదిక దగ్గర రౌద్రరూపం ప్రదర్శించారు. అధిష్టానానికి తన విధేయతను చాటుకునేందుకే ఇంత హైడ్రామా చేశారా అని విజయవాడ పొలిటికల్ సర్కిల్స్‌ వినిపిస్తున్న టాక్.

Advertisement

Also Read: అర్హుల‌కు రైతుబంధు సంక్షేమం.. అంద‌రికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్ద‌రూ చేసింది రెండోదే..!

రీ-ఎంట్రీ ఇచ్చారా?

సొంత సామాజికవర్గం వివాదంలో దెబ్బతిన్న పొలిటికల్ ఇమేజ్‌ను, క్రేజ్‌ను తిరిగి తెచ్చుకోవడానికే బొండా ఉమ ఈ స్థాయిలో రీ-ఎంట్రీ ఇచ్చారా? అనే క్వశ్చన్స్ రేజ్‌ అవుతున్నాయి. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా నేరుగా శిబిరాల దగ్గరకే వెళ్లి ఆందోళన చెదరగొట్టడం ద్వారా క్యాడర్‌లో గ్రాఫ్ పెంచుకునే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇమేజ్‌ను నిర్మించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక వివాదం చాలు… ఆ ఇమేజ్‌కు గీత పడటానికి. ఈ విషయం తెలుసుకున్న బొండా ఉమ.. ఆ గీత చేరిపేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారా?

Advertisement

Also Read: ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!

Tags

Related News

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

Big Stories

Advertisement
×