Pushpa 2 : ఎట్టకేలకు పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) థియేటర్లలోకి వచ్చేసింది. ఏ థియేటర్లో చూసినా జాతర వాతావరణం కనిపిస్తోంది. వాస్తవానికి మొదటి రోజు కంటే రెండవ రోజు షోలు తగ్గాయి. అయినప్పటికీ ఓపెనింగ్ పరంగా ఈ సినిమా రికార్డుల దుమ్ము దులుపుతోంది. అయితే మరోవైపు కొన్ని థియేటర్లలో ఈ సినిమా వల్ల నెలకొన్న గందరగోల పరిస్థితులు ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ థియేటర్లో అజ్ఞాతవ్యక్తి చేసిన మిస్టీరియస్ స్ప్రే కారణంగా ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తోంది.
ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ స్క్రీనింగ్ టైమ్ లో ఓ వ్యక్తి మిస్టీరియస్ స్ప్రేను ఉపయోగించాడు. దీని కారణంగా డిసెంబర్ 5న అక్కడ షో ఆగిపోయినట్టు సమాచారం. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సమాచారం ప్రకారం విరామం తర్వాత 15-20 నిమిషాల పాటు స్క్రీనింగ్ ను ఆపేశారు థియేతర యాజమాన్యం. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2’ (Pushpa 2) రన్‌టైమ్ మూడు గంటల 21 నిమిషాలు అన్న సంగతి తెలిసిందే.
గుర్తు తెలియని వ్యక్తి దగ్గు, గొంతు చికాకు, వాంతులు కలిగించే పదార్థాన్ని స్ప్రే చేశాడని, దాని వల్ల ఆడియన్స్ కంప్లయింట్స్ ఇవ్వడంతో షో ఆగిపోయింది. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత స్క్రీనింగ్ తిరిగి ప్రారంభమైంది. థియేటర్‌లో ఏ స్ప్రే ఉపయోగించారనే దానిపై పోలీసు అధికారులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బయట బహిరంగ ప్రదేశంలో వాడాల్సిన స్ప్రేని థియేటర్‌లో వాడినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు స్ప్రే చేశాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిజానికి హీరోల అభిమానులు థియేటర్లలో సినిమాలను చూస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ తో ఇలాంటివి చేస్తో ఉంటారు. పేపర్లు ఎగరేయడం, డ్యాన్స్ చేయడం, అరవడం కామన్. కానీ ఇవి ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టనంత వరకు ఓకే. హద్దు దాటితేనే ప్రమాదం. ఇక మరోవైపు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తల్లి, కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. దీంతో బెనిఫిట్ షోలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఇక నుంచి తెలంగాణలో సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండబోవు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ (Pushpa 2) భారతదేశంలో మొదటి రోజు 175 కోట్ల నెట్ వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. హిందీ వెర్షన్ భారతదేశంలో 67 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (jawan) రికార్డును బ్రేక్ చేసింది.