OTT Movie : సత్యరాజ్, ఉదయ భాను ప్రధాన పాత్రల్లో నటించిన ‘త్రిబానధారి బర్బరిక్’ ఈ రోజునుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ పొందని ఈ సినిమా ఓటీటీ మీద అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా మహాభారతంలోని, ఘటోత్కచుడి కొడుకు బర్బరిక్ చుట్టూ తిరుగుతుంది. ఆ కాలం వ్యక్తి , ఈ కాలంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.
‘త్రిబానధారి బర్బరిక్’ (Tribanadhari Barbarik) 2025లో వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా. దీనికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఇందులో సత్యరాజ్, ఉదయ భాను, రామ్, సత్యం రాజేష్ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. 2025 అక్టోబర్ 10 నుంచి Sun NXT, Prime Videoలో తెలుగు, తమిళం, కన్నడ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ మహాభారతంలోని బర్బరిక్‌తో మొదలవుతుంది. బర్బరిక్ మరెవరో కాదు ఘటోత్కచుడి కొడుకు. ఘటోత్కచుడి గురించి అందరికీ తెలిసిందే. మహాభారతంలో భీముడికి, హిడింబి అనే రాక్షసికి పుట్టినవాడు. ఇతని కొడుకు బర్బరిక్ కి మూడు బాణాలతో ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఈ బాణాలు ఎవరినైనా ఒక్కసారిలో ఓడిస్తాయి. అయితే ఈ కాలంలో బర్బరిక్ మళ్లీ వస్తాడు. అతను ఈ కొత్త ప్రపంచాన్ని చూసి ఆశ్చర్య పోతాడు. కలికాలం ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తాడు. ఇక్కడ అమాయకులను కాపాడడాలనుకుంటాడు.
Read Also : ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్రా బాబూ… కూతుర్ల కోసం పగతో రగిలిపోయే తల్లులు… మోసగాడిని బ్రతికించి చేయకూడని పని
ఈ సమయంలో అతను డాక్టర్ శ్యామ్ కత్తు అనే వ్యక్తిని కలుస్తాడు. శ్యామ్ బర్బరిక్‌కు ఒక గైడ్‌లా మారతాడు. బర్బరిక్ తన దగ్గర ఉన్న మూడు బాణాలతో చెడ్డ వాళ్లను టార్గెట్ చేస్తాడు. ఇక ఈ కథలో లేడీ విలన్ గా ఉదయ భాను ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ ఒక పాప మిస్సింగ్ అవ్వడంతో కథ థ్రిల్లర్ వైబ్ గా మారుతుంది. బర్బరిక్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వడంతో కథ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఆ పాప ఎవరు ? ఎలా మిస్ అయింది ? బర్బరిక్ అమాయకులను ఎలా కాపాడుతాడు ? అనే విషయాలను, ఈ తెలుగు థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.