BigTV English

Healthy Diet: జ్యూస్ తాగితే మంచిదా.. పండ్లు తింటే మేలా?

Healthy Diet: జ్యూస్ తాగితే మంచిదా.. పండ్లు తింటే మేలా?

Healthy Diet: ఫ్రూట్స్ అనగానే మనకి గుర్తుకువచ్చేవి యాపిల్, మామిడిపండు, అరటిపండు, దానిమ్మ, గ్రేప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే, ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయని మనకి తెలిసిన విషయమే. కానీ, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ రెండిటిలో ఏది ఎక్కువ హెల్దీ అనే అనుమానం మనలో చాలా మందికి చాలాసార్లు వచ్చే ఉంటుంది. రెండూ హెల్దీ అయినప్పటికీ నష్టాలు కూడా ఉండొచ్చు. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.


పండ్లు తింటే?
ఫ్రూట్స్ అనేవి నేచురల్ ఫుడ్. ఇవి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. యాపిల్, అరటి, నారింజ వంటి ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి బాడీని కంట్రోల్లో పెడుతుంది. ఇందులోని ఫైబర్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బలబద్దకాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఉదాహరణకు, నారింజలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచితే, అరటిలో పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తుంది. ఫ్రూట్స్ తినడంవల్ల తక్కువ కేలరీలతో ఎక్కువ ఆకలిని తీరుస్తాయి కాబట్టి శరీర బరువు కూడా కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

జ్యూస్ వల్ల జరిగేది ఇదే..!
తాజా ఫ్రూట్ జ్యూస్ లు తాగడంవల్ల విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందుతాయి. ఎంత హెల్దీ అయినప్పటికీ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రూట్ జ్యూస్ తయారు చేసే సమయంలో ఫైబర్ పిప్పి రూపంలో బయటకు పోతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే చక్కెర వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్ కు దారితీస్తుంది. బయట జ్యూస్ సెంటర్లలో తయారు చేసిన జ్యూస్లలో ఆర్టిఫిషియల్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల మరింత ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి, ఇంట్లో తయారుచేసిన తాజా జ్యూస్లను అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.


ఏది బెటర్?
ఫ్రూట్స్ తినడం జ్యూస్ తాగడం కంటే ఎక్కువ ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ఎంతుకంటే ఫ్రూట్స్‌లో ఎక్కువ ఫైబర్, తక్కువ చక్కెర ఉండటం వల్ల అవి శరీరానికి మంచి పోషణను అందించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జ్యూస్ తాగడం వల్ల అప్పటికప్పుడు శక్తి లభించినా ఎక్కువ తాగడంవల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 ఫ్రూట్స్ తినడం, అవసరమైతే ఒక చిన్న గ్లాసు ఫ్రెష్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల సలహా.

ఫ్రూట్స్ తినడం ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం ఆరోగ్యకరమైనా అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. విభిన్న రంగుల పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. జ్యూస్ లు తాగినప్పుడు దాన్ని నీటితో కలిపి తీసుకోవడం, స్మూదీల రూపంలో తీసుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వీటిలో కొంతవరకు ఫైబర్ ఉండడంవల్ల జీర్ణసమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ముఖ్యం అనుకునేవాళ్లు ఎక్కువగా ఫ్రూట్స్‌ను తింటూ అప్పుడప్పుడు తక్కువ మోతాదులో జ్యూస్‌లు తీసుకోవడం మంచిదని వైద్యుల సలహా.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×