BigTV English

Dementia: ఈ వ్యాధి ఉందని నిర్ధారించడానికి మూడున్నర సంవత్సరాలు పడుతుంది… ఎందుకంత ఆలస్యం తెలుసా?

Dementia: ఈ వ్యాధి ఉందని నిర్ధారించడానికి మూడున్నర సంవత్సరాలు పడుతుంది… ఎందుకంత ఆలస్యం తెలుసా?

డిమెన్షియా వ్యాధిని చిత్తవైకల్యం అని కూడా అంటారు. ఇది తీవ్రమైన ఒక మానసిక వ్యాధి. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఈ వ్యాధి కేవలం ముసలి వారికే రావాలని లేదు. ఏ వయసులోనైనా రావచ్చు. ఈ వ్యాధి వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వారు ఆలోచించే సామర్థ్యం కూడా సన్నబడుతుంది. సరిగా ఇతరులతో మాట్లాడలేరు. ఒక రకమైన అల్జీమర్స్ వ్యాధిగానే దీన్ని చెప్పుకోవాలి. ఈ డిమెన్షియా వ్యాధి వచ్చిందని నిర్ధారించడానికి మూడున్నర సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సమయం పడుతుందో కూడా నిపుణులు వివరిస్తున్నారు.


డిమెన్షియాను గుర్తించలేరు
ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రిలో వచ్చిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం డిమెన్షియా లక్షణాలు కనిపించిన తర్వాత ఆ వ్యాధి వచ్చిందని నిర్ధారించడానికి మూడున్నర సంవత్సరాలు పడుతుంది. ఆ వ్యాధి వచ్చిన రోగి చిన్న వయసులో ఉంటే అతడికి ఆ వ్యాధి నిర్ధారణకు నాలుగున్నర సంవత్సరాల పట్టవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం డిమెన్షియా వ్యాధి నిర్ధారించడానికి సరైన పరీక్ష లేదు.

సరైన ఆరోగ్య పరీక్ష లేక…
మెడికల్ న్యూస్ టుడే చెప్పిన నివేదిక ప్రకారం డిమెన్షియా వ్యాధిని గుర్తించడానికి సరైన పరీక్ష ఏదీ లేదు. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగానే మొదలవుతాయి. అది కూడా చాలా నెమ్మదిగా బయటపడతాయి. దీన్ని ప్రజలు ఒత్తిడి వల్ల నిరాశ వల్ల వృద్ధాప్యం వల్ల వచ్చిన లక్షణాలుగా భావిస్తారు కొంతమంది అల్జీమర్స్ అనుకునే అవకాశం ఉంది వైద్యులు కూడా ఈ వ్యాధి లక్షణాలను డిమాండ్షియా గా భావించరు దీనివల్లే ఈ వ్యాధి గుర్తించడానికి లేదా నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతుంది


ప్రారంభ లక్షణాలు ఇదిగో
డిమాండ్షియా ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి వీటిని ఒక వ్యాధిగా కూడా ఎవరూ గుర్తించరు ఈ వ్యాధి ప్రారంభంలో చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు ఏకాగ్రత కుదరదు అప్పుడప్పుడు తేలికపాటి గందరగోళం కూడా అనిపిస్తుంది సాధారణంగా దీన్ని ఎవరు కూడా తీవ్రంగా తీసుకోరు కుటుంబ సభ్యులు కూడా దీన్ని సాధారణమైన వయసుతో వచ్చిన లేదా ఒత్తిడి వల్ల కలిగిన లక్షణాలు గానే భావిస్తారు వైద్యుల్ని కూడా కొన్ని ఏళ్ల పాటు సంప్రదించరు అది బాగా ముదిరిపోయాకే వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు అందుకే ఈ వ్యాధి బయటపడడానికే ఎక్కువ సమయం పడుతుంది

అయితే పెద్ద వయసులో ఉన్న వారిలో డిమాండ్షియానో త్వరగా గుర్తించవచ్చు కానీ అదే వయసు తక్కువగా ఉన్న వారిలో వస్తే అది గుర్తించడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది ఒక వ్యక్తి చిన్న వయసులోనే డిమాండ్ చేయాలి లక్షణాలను అనుభవిస్తే సాధారణంగా వాటిని విస్మరిస్తారు ఒత్తిడి వల్ల కలిగిన లక్షణంగా భావిస్తారు అందుకే ఈ వ్యాధిని గుర్తించడానికి వారికి ఎక్కువ సమయం పడుతుంది. వైద్యులు కూడా వయసు చిన్నదే కాబట్టి డిమాండ్షియా వచ్చిందని అనుమానం వారికి రాదు కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి ఇతర పనుల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తారు కాబట్టి డిమాండ్షియా లక్షణాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏకాగ్రత లోపం మాట్లాడడంలో ఇబ్బంది గందరగోళంగా అనిపించడం విషయాలు త్వరగా మర్చిపోవడం వంటివి జరుగుతూ ఉంటే ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×