TV Actress Mother Death: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులందరూ ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బుల్లితెర సెలబ్రిటీల విషయంలో కూడా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బుల్లితెర నటి అంజలి (Anjali), సంతోష్ పవన్ (Santosh Pawan)ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీరియల్ నటి అంజలికి మాతృవియోగం కలిగింది. తన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్టు తెలుస్తుంది. తాజాగా ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఈ సందర్భంగా అంజలి తన తల్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఆమె మరణాన్ని తెలియజేశారు.
జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి..
అంజలి తన అమ్మ ఫోటోని షేర్ చేస్తూ…”అమ్మ నువ్వు లేని లోటు మాటలలో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుండి దూరం చేసినా, మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు. నీ ఆశీస్సులు నీ వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది…అమ్మ ఆత్మకు శాంతి కలగాలి” అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అంజలి అభిమానులు కూడా తన తల్లి మరణం పట్ల స్పందిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అంజలికి ధైర్యం చెబుతున్నారు.
రెండో బిడ్డకు జన్మనిచ్చిన అంజలి..
ఇకపోతే ఇటీవల అంజలి తనకు సంబంధించి శుభవార్తను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. అంజలి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ప్రెగ్నెన్సీ గురించి అలాగే సీమంతపు వేడుక గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. అలాగే తనకు పండంటి బిడ్డ జన్మించారని తెలిపారు. అయితే తనకు అబ్బాయి పుట్టారా, అమ్మాయి పుట్టారా అనేది మాత్రం తెలియచేయలేదు. ఇలా తనకు రెండో బిడ్డ (Blessed Second Baby)జన్మించారు అంటూ అభిమానులతో శుభవార్తను షేర్ చేసుకున్న ఈమె ఇలా తన తల్లి మరణం గురించి తెలపడంతో అభిమానులు కూడా ఒకింత షాక్ అవుతున్నారు.
అంజలి తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలా తన తల్లి మరణం అనేది ఆమెకు జీర్ణించుకోలేని విషయంగా మారిందని చెప్పాలి. ఇక ఈమె తన తల్లి మరణం గురించి తెలియజేస్తూ కన్నీటి పర్యంతరం అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఈమెకు ధైర్యం చెబుతున్నారు. ఇక అంజలి మొగలిరేకులు(Mogalirekulu) సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ అనంతరం ఈమె రాధా కళ్యాణం, దేవత వంటి సీరియల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర సీరియల్స్ తో పాటు పలు కార్యక్రమాలతో పాటు బీబీ డాన్స్ షో కార్యక్రమాలలో కూడా అంజలి పవన్ సందడి చేస్తూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా పలు బిజినెస్లను కూడా ఈ జంట నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Jabardast Rakesh:ఘనంగా రాకింగ్ రాకేష్ సుజాత కూతురి మొదటి పుట్టినరోజు.. సందడి చేసిన రోజా!