Cow Urine: గోమూత్రం రోగాలను నయం చేస్తుంది’ అన్న ప్రచారం మన దేశంలో చాలాకాలంగా ఉంది. పెద్దలు మాత్రమే కాదు, సమాజంలో పేరు పొందినవాళ్లు, రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని తరచూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీనిపై ప్రచారం మరింత విస్తృతమైంది. కానీ శాస్త్రీయ పరిశోధనలు మాత్రం వేరే నిజాన్ని చెబుతున్నాయి.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
తాజాగా బికనీర్‌లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒక పెద్ద అధ్యయనం చేసింది. ఆ పరిశోధనలో గో మూత్రం మనుషులకు ప్రయోజనం కాదని స్పష్టంగా తేల్చింది. దాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని కూడా పేర్కొంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గో మూత్రం మాత్రం కొన్ని ప్రయోజనాలు కలిగిస్తుందని అదే అధ్యయనం చెబుతోంది.
ఇన్‌స్టిట్యూట్ అధికారి డాక్టర్ ఎన్ఆర్ రావత్ మాట్లాడుతూ, ఇది జంతువులపై పరిశోధనలు చేసే అత్యంత విశ్వసనీయ సంస్థ అని, అందువల్ల వచ్చిన ఫలితాలను తేలికగా తీసుకోలేమని చెప్పారు. గోమూత్రంలో అనేక రకాల హానికరమైన బాక్టీరియా ఉన్నాయని, అవి నేరుగా కడుపు సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని కూడా వివరించారు. అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన కొన్ని అధ్యయనాల్లో గోమూత్రం సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రతికూల ప్రభావం చూపిందని గుర్తించారు. ఇంకా ఎక్కువ నమూనాలను సేకరించి, దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెప్పారు.
Also Read: Red Banana: ఎర్రటి అరటి పండు ఎప్పుడైనా తిన్నారా? కనబడితే వెంటనే కొనేయండి!
ఆయుర్వేదం ఏం చెబుతుంది
గోమూత్రం అనేక వ్యాధులను తగ్గించే శక్తి కలిగి ఉందని ఆయుర్వేదం చెబుతుంది. ఇందులో కుకురిన్ అనే పదార్థం ఉందని, అది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా తగ్గించగలదని చెబుతున్నారు. చర్మవ్యాధులకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం. అయితే ఆయుర్వేద నిపుణులు కూడా ఈ పరిశోధనను మరింత కొనసాగించాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తున్నారు.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఈ అధ్యయనంలో మొత్తం 73 నమూనాలను పరీక్షించారు. ఇందులో ఆవు, గేదె, మూత్ర నమూనాలు కూడా ఉన్నాయి. పరీక్షల తర్వాత గోమూత్రంలో 13 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు బయటపడింది. వీటివల్ల కడుపులో పలు రకాల వ్యాధులు రావచ్చని పరిశోధకులు తేల్చారు. అయితే గోమూత్రం గురించి ఉన్న ప్రచారాలు ఒక వైపు, శాస్త్రం చెబుతున్న వాస్తవాలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇది సహజ ఔషధని నమ్మకాలు ఉంటే, మరోవైపు అదే ఆరోగ్యానికి ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మనషులకు ప్రమాదమా, లేక నష్టమా అనే నిజం తెలియడానికి ఇంకా మరింత స్పష్టమైన శాస్త్రీయ పరిశోధనలు చాలా అవసరం. కానీ గోమూత్రం తాగేవారు నేరుగా సేవించడం మంచిది కాదని రీసెర్చ్ కంపెనీలు సూచిస్తున్నారు.