Red Banana: అరటిపండు చాలా మంది ఇష్టంగా తినే పండు. సాధారణంగా మనం చూసేది పసుపు తొక్కతో ఉండే అరటే. కానీ మీకు తెలుసా? అరటి పండ్లకీ ఒక ప్రత్యేకమైన రకం ఉంది. అదే ఎరుపు తొక్కతో ఉండే ఎర్ర అరటి పండ్లు. చాలామందికి ఇవి రుచి చూసే అవకాశం కూడా రాలేదు. వినగానే ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ నిజంగానే ఈ ఎర్ర అరటి పండ్లు ఉన్నాయి, అంతేకాదు వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఎర్ర అరటిపండు సాధారణ అరటితో పోల్చితే రుచిలో, పోషకాలలో ప్రత్యేకాన్ని కలిగి ఉంటుంది. ఈ పండు తింటే శరీరానికి ఎటువంటి లాభాలు ఎంటో, ఎలాంటి పోషకాలు ఉంటాయి, ఎవరు జాగ్రత్తగా తీసుకోవాలి అన్న విషయాలన్ని ఇప్పుడు చూద్దాం.
ఎర్ర అరటికాయ సాధారణ అరటికాయ కంటే కొంచెం తీపి, మంచి రుచితో ఉంటుంది. ఈ అరటి తొక్క ఎరుపు రంగులో లోపల గుజ్జు పింక్ కలర్‌లో కనిపిస్తుంది. ఈ పండు కేవలం రుచికోసమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.
మొదటగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఎర్ర అరటిలో విటమిన్ C పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి.
కంటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిదే
ఇందులో ఉండే బీటా కెరోటిన్ చూపును కాపాడుతుంది. వయస్సుతో వచ్చే కంటి సమస్యల నుంచి రక్షణ కలిగిస్తుంది.
Also Read: Trains Turns Tiny Home: రైలు బోగీలను ఇళ్లుగా మారిస్తే.. వావ్, ఎంత బాగున్నాయో చూడండి!
జీర్ణక్రియకు మేలు చేస్తుంది
జీర్ణక్రియ సాఫీగా జరిగేలా ఇందులో ఉన్న ఫైబర్ సహాయపడుతుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా పేగుల్లో ఉన్న మంచి బాక్టీరియా పెరగడానికి ఇది తోడ్పడుతుంది.
రక్తపోటు నియంత్రణ
గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. పొటాసియం అధికంగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో సహకరిస్తుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.
వ్యాయామం చేసే వారు తింటే
సహజమైన చక్కెరలు ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారు తింటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీరంలో వృద్ధాప్య ప్రభావాలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇది తిన్న వెంటనే శక్తిని అందించేస్తుంది.
అధిక బరువును తగ్గిస్తుంది
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది తోడ్పడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు నిండుగా అనిపిస్తుంది. అందువల్ల అదనపు ఆహారం తీసుకునే తాపత్రయం తగ్గుతుంది. గర్భిణీలకు కూడా ఇది మేలు చేస్తుంది. విటమిన్ B6 ఉండటంతో శిశువు ఎదుగుదలలో సహకరిస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. మొత్తం మీద ఎర్ర అరటికాయను రోజూ ఒకటి లేదా రెండు తింటే శరీరానికి కావలసిన పోషకాలు లభించి ఆరోగ్యం బలపడుతుంది.