Karthi Kaithi 2 Delay: తమిళ్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ చిత్రాలతోనే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కార్తీ నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందులో ఖైదీ ఒకటి. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019లో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో లోకేష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే 2019లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీసుకొస్తున్నట్టు మూవీ ప్రకటించింది.
కార్తీకి హ్యాండ్ ఇచ్చిన లోకేష్
‘కూలీ’ మూవీ తర్వాత లోకేష్ ‘ఖైదీ 2’ పట్టాకెక్కిస్తానని చెప్పాడు. అన్నట్టు ఇక ఖైదీ 2 వచ్చేస్తుందని ఫ్యాన్స్ అంతా ఆసక్తగా ఎదురు చూశారు. ఇప్పటికే కార్తీ కూడా ఖైదీ 2కి కాల్షిట్స్ కూడా ఇచ్చేశాడట. అయితే సడెన్ లోకేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తొంది. ఖైదీ 2 కాకుండా మరో సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే మల్టీస్టారర్ మూవీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడు. దీనికి హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో లోకేష్ ఖైదీ 2ని పక్కన పెట్టి ఈ మల్టీస్టారర్‌పై ఫోకస్ పెట్టాడట. అలాగే లోకేష్ కనగరాజ్ కూడా హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.
సుందర్ సి మూవీకి గ్రీన్ సిగ్నల్
కానీ, తన సినిమా కంటే ముందు ఖైదీ 2 చేస్తానని చెప్పిన లోకేష్.. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లతో మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తి చూపించడంతో.. కార్తీ తన కాల్షిట్స్‌ని క్యాన్సిల్ చేసుకున్నాడట. అంతేకాదు మరో డైరెక్టర్ తో సినిమాకి ఓకే చెప్పాడట. సుందర్ సితో ఓ సినిమాకు కమిట్ అయ్యాడట. ఖైదీ 2 వాయిదా పడటంతో.. ఈ మూవీ డేట్స్.. సుందర్ సి చిత్రానికి కేటాయించాడట. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఖైదీ 2 మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందట. ఇది తెలిసి మూవీ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీ.. సర్దార్ 2, మార్షల్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సర్దార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరోవైపు మార్షల్ మూవీ ఇటీవల షూటింగ్‌ని స్టార్ట్ చేసుకుంది. డ్రీం వారియర్ పిక్చర్స్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కని కూలీ మూవీ విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచాలన మధ్య విడుదలైన ఈ చిత్రం ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ లు ముఖ్యపాత్రలు పోషించారు. ఆగష్టు 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది.
Also Read: Cine Workers Strike: ఈ వేతనాలు మాకోద్దు.. సినీ కార్మికులు అసంతృప్తి.. సోమవారం ఏం జరగబోతుంది?