Japanese Skin Care: జపనీస్ మహిళలు తమ మచ్చలేని, మెరిసే చర్మం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. వారి చర్మం మృదువుగా , ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా, సహజమైన మెరుపును కూడా కలిగి ఉంటుంది. ఇది ఏదైనా ఆ అందం కేవలం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల కాదు. సింపుల్ హోం రెమెడీస్ వల్ల ఇది సాధ్యం అవుతుంది.
జపనీస్ స్కిన్ కేర్:
డబుల్ క్లెన్సింగ్‌తో ప్రారంభించండి:
జపనీస్ స్కిన్ కేర్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే డబుల్ క్లెన్సింగ్, అంటే ముఖాన్ని రెండుసార్లు శుభ్రం చేసుకోవడం. ముందుగా, ఆయిల్ ఆధారిత క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇది మేకప్, సన్‌స్క్రీన్, మురికి కారణంగా ఏర్పడిన జిడ్డును పూర్తిగా తొలగిస్తుంది. దీని తరువాత.. ఫోమింగ్ ఫేస్ వాష్‌తో చర్మాన్ని లోతుగా శుభ్రపరచాలి. ఈ ప్రక్రియ చర్మం యొక్క రంధ్రాలను తెరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇది మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఎక్స్‌ఫోలియేషన్:
జపనీస్ స్కిన్ కేర్‌లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం ఒక ముఖ్యమైన భాగం. సున్నితమైన స్క్రబ్‌లు లేదా ఎంజైమ్ ఆధారిత ఎక్స్‌ఫోలియెంట్‌లను ఇందుకు ఉపయోగిస్తారు. ఇవి మృత కణాలను తొలగించి చర్మాన్ని కొత్తగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ ప్రక్రియ చర్మ ఉపరితలాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. ఇది జిడ్డు చర్మం, మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది.
టోనర్ లేదా లోషన్ వాడకం:
జపనీస్ మహిళలు చర్మాన్ని శుభ్రపరిచి, ఎక్స్‌ఫోలియేట్ చేసిన తర్వాత, హైడ్రేటింగ్ టోనర్‌ను అప్లై చేస్తారు. దీనిని ‘లోషన్’ అని పిలుస్తారు. ఈ టోనర్ చర్మాన్ని లోతుల నుంచి తేమగా చేస్తుంది. ఇది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. టోనర్ చర్మం యొక్క pH సమతుల్యతను నిర్వహిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
సీరం:
సీరమ్‌లలో మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు, వృద్ధాప్య సంకేతాలతో పోరాడే పదార్థాలు ఉంటాయి. జపనీస్ మహిళలు చర్మాన్ని తేమగా చేసి పోషించే హైడ్రేటింగ్ సీరమ్‌లను ఇష్టపడతారు. క్రమం తప్పకుండా వాటిని ఉపయోగించడం వల్ల చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. అంతే కాకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
Also Read: శరీరంలో విటమిన్ బి-12 లోపిస్తే ?
మాయిశ్చరైజర్:
చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్ ఒక ముఖ్యమైన భాగం. జపనీస్ మహిళలు చర్మాన్ని హైడ్రేటెడ్, మృదువుగా ఉంచడానికి రోజుకు చాలాసార్లు దీనిని అప్లై చేస్తారు. మాయిశ్చరైజర్ చర్మంలోని తేమను లాక్ చేస్తుంది. అంతే కాకుండా ఇది బాహ్య కాలుష్యం నుంచి రక్షిస్తుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో సహాయపడుతుంది.