గుమ్మడి గింజలు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. దీనిలో మనకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి, మెదడు పని తీరుకు గుమ్మడి గింజలు అవసరమైనవి. మీరు ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తిని చూడండి. మీలో ఎన్నో మంచి మార్పులు వస్తాయి.
గుండెకు ఉత్తమం
గుమ్మడికాయల గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెను సజావుగా పనిచేసేలా చేస్తుంది.గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచే శక్తి దీనికి ఉంది. కాబట్టి గుండె జబ్బులు రాకుండా గుమ్మడి గింజలు అడ్డుకుంటాయి.
సరైన నిద్రకు
రాత్రి ప్రశాంతంగా నిద్రపోతేనే ఎవరైనా ఆరోగ్యంగా జీవించగలరు. గుమ్మడికాయ గింజల్లో ట్రిప్తో ఫాన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ వంటి నిద్రా హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. పడుకునే ముందు ఒక స్పూను గుమ్మడి గింజలు తిని చూడండి. మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇది నిద్రా చక్రాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం కంటెంట్ కండరాలు నరాలను సడలిస్తుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర దక్కుతుంది.
మెదడు పనితీరుకు
గుమ్మడికాయ గింజలను ప్రతిరోజు తినడం వల్ల జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇవి అభిజ్ఞా పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. నరాల సిగ్నలింగ్, మెదడు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. గత ఏడాది చేసిన ఒక పరిశోధన ప్రకారం ప్రతిరోజు గుమ్మడి గింజలు తినడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం
రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే మీరు ప్రతిరోజు గుమ్మడి గింజలను తినాలి. వీటిలో జింక్, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఇందులో ఉంటే జింక్ గాయాలను దూరంగా నయం చేయడానికి సహాయపడుతుంది. జలుబుతో పోరాడడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఈ కూడా ఇందులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుతుంది.
Also Read: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా? ప్రతిరోజు ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తినిపించండి