BigTV English

Vishwaksen: గామి చిత్రానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శన..!

Vishwaksen: గామి చిత్రానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శన..!

Vishwaksen:ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మాస్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన మరోవైపు రొమాంటిక్ బాయ్ గా కూడా పేరు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు హీరోలు లేడీ గెటప్ లలో నటించి అద్భుతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జాబితాలోకి విశ్వక్ సేన్ కూడా చేరిపోయారు. ఈ కుర్ర హీరో తాజాగా నటిస్తున్న సినిమా లైలా(Laila). ఇందులో విశ్వక్ సేన్ మొదటిసారి లేడీ గెటప్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు లేడీ గెటప్ లో అమ్మాయిలు సైతం కుళ్ళుకునేలా చాలా అందంగా కనిపించారు విశ్వక్ సేన్.


లేడీ గెటప్ లో అలరించబోతున్న విశ్వక్ సేన్..

ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాదులోని పాత బస్తీలో హీరో మేకప్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. ఇందులో ఆడవాళ్లకు మేకప్ వేస్తూ వాళ్లను బుట్టలో వేసుకునే లవర్ బాయ్ గా విశ్వక్ సేన్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ టీజర్ లో అమ్మాయిలకు మేకప్ వేయడమే కాదు అవసరమైతే యాక్షన్ రంగంలోకి కూడా దిగుతాడు. అలా ఈ టీజర్ లో విశ్వక్ చెప్పిన డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి


విశ్వక్ మూవీకి అంతర్జాతీయ గుర్తింపు..

ఉండగా తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ నటించిన ‘గామి ‘ చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది.తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఈ సినిమా సెలెక్ట్ అయినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డామ్ – 2025 కు అధికారికంగా సెలెక్ట్ అయింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా విశ్వక్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గామి మూవీ విశేషాలు..

ఈ సినిమా విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి (Chandini choudhury) హీరోయిన్గా తెరకెక్కిన చిత్రమిది. విద్యాధర్ కాగిత ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే విశ్వక్ సేన్ దాదాపు నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేశారు. అడ్వెంచర్స్ ఫాంటసీ ఫిలిం గా వచ్చిన ఈ చిత్రానికి కార్తీక్ శబరీస్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇందులో ఎం జి అభినయ, మహమ్మద్ సమ్మద్ ,దయానంద రెడ్డి, హారిక కీలక పాత్రలో పోషించారు. గత ఏడాది మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక దీంతో ఈ సినిమాకు ఇప్పుడు ఈ అరుదైన గౌరవం లభించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా విశ్వక్ మూవీకి ఈ రేంజ్ లో గుర్తింపు అంటే మామూలు విషయం కాదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×