Gen Z Movement: నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఝాలనాథ్ ఖనాల్ భార్య రబి లక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల చేతిలో దారుణంగా మరణించారు. కాసేపటి క్రితమే నేపాల్ లోని దల్లు ప్రాంతంలోని వారి నివాసాన్ని ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆందోళనకారులు రబి లక్ష్మి చిత్రికార్ ను బలవంతంగా ఇంటి లోపలికి తోసి ఇళ్లు మొత్తాన్ని తగలబెట్టారు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మీ చిత్రికార్ ను కిర్తిపూర్ బర్న్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Horrific & Si¢kening Visuals from Nepal: House of former PM Jhalanath Khanal was set on Fire by the Protestors, his wife is burπt alive! Khanal was close to China & had multiple corruption cases against him #NepalProtest pic.twitter.com/ceWnpMn06w
— Mihir Jha (@MihirkJha) September 9, 2025
ఈ సంఘటన నేపాల్‌లో జరుగుతున్న హింసాత్మక ఆందోళనల మధ్య జరిగింది. జెన్-జెడ్ యువత నేతృత్వంలో నేపాల్ దేశంలో నిరసనలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిరసనకారులు మాత్రం ఆందోళనను విరమించడం లేదు. ఇప్పటికే ప్రధాని కేపీ ఓలి శర్మ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిరసనకారులు తగ్గడం లేదు. నేపాల్ లో ఇవాళ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 22కి చేరుకుంది. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆందోళనలు రాజకీయ అసమ్మతి, సామాజిక అసంతృప్తి నుంచి ఉద్భవించాయి. ఇవి నేపాల్ రాజకీయ వ్యవస్థలో ఏర్పడిన సమస్యలను సూచిస్తున్నాయి.
ALSO READ: Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!
ఝాలనాథ్ ఖనాల్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యుఎమ్‌ఎల్) నాయకుడు. 2011లో ఏడు నెలల పాటు ఆయన ప్రధానిగా పనిచేశారు. ఆయన భార్య రబీ లక్ష్మీ ఒక సామాన్య మహిళ, కానీ రాజకీయ హింసకు బలైపోయారు. ఇటువంటి సంఘటనలు సమాజంలో చోటుచేసుకోవడం దారుణమని చెప్పవచ్చు. ఆందోళనలు హక్కుల కోసం జరగాలి.. కానీ వ్యక్తిగత దాడులు, ఆస్తి నష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటన నేపాల్ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారింది. ఆందోళనకారుల డిమాండ్‌లను పరిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.