Kiwi Health Benefits: కివీ చూడటానికి చిన్నగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కివీలో తక్కువ కేలరీలతో మంచి పోషకాలు నిండి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ C ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సాధారణ సమస్యలైన జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుండి కివీ మన శరీరాన్ని రక్షించగలదు.
కివీ లోని ఫైబర్ మన జీర్ణక్రియకు సులభంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. కివీ తినడం వల్ల కడుపులో నొప్పి, మంట, అజీర్ణ సమస్యలు రాకుండా చేసేందుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా, కివీలోని పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తపోటును నిలకడగా ఉంచేందుకు సహాయపడుతుంది. మన గుండె దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి కివీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
చర్మానికి కూడా కివీ మంచి క్రీమ్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సీ, ఈ లాంటి పోషకాలు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. కాబట్టి, రోజు కివీ తినడం వల్ల చర్మ సౌందర్యానికి ఇది మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది.
Also Read: Allu Sirish: అన్నలా అవ్వడం కష్టం కానీ.. మనం రూట్ మారుద్దాం
అదే విధంగా, కివీలో విటమిన్ కే, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి, కీళ్ల నొప్పులు రాకుండా పని చేస్తుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అనుకోకుండా ప్రమాదం జరిగినా వాటి నుంచి త్వరగా కోలుకునే శక్తిని ఇస్తుంది. క్రీడాకారులు, పిల్లలు, వృద్ధులు అందరూ దీని తినడం వల్ల మంచి లాభం పొందినవారే ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
ఇంకా, కివీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఫలం. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా, స్థిరంగా ఉంటుంది. షుగర్ స్థాయి నియంత్రణలో ఉండేందుకు కివీ సహాయపడుతుంది. రక్తంలో షుగర్ స్థిరంగా ఉంచుకోవాలనుకునే వారు దీనిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుని తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అందువల్ల, ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివీ తినడం మంచిది. ప్రతిరోజూ కివీ తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది, రోగాలు దూరంగా ఉంటాయి.