Lavanya -Raj Tarun: సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న రాజ్ తరుణ్(Raj Tarun) గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన లావణ్య (Lavanya) అనే మహిళ కారణంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎన్నో గొడవలు చోటు చేసుకోవడంతో ఒకరిపై మరొకరు కేసు పెట్టుకుని వీరి వివాదం కోర్టు వరకు వెళ్ళింది. ఇలా పలు సందర్భాలలో లావణ్య రాజ్ తరుణ్ పై ఎన్నో ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న రాజ్ తరుణ్ లావణ్య మరోసారి వార్తలలోకి వచ్చారు. తాజాగా లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసింది. తాను కోకాపేట(Kokapet) ఇంటిలో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులు తనపై పలు సందర్భాలలో దాడి చేశారు అంటూ ఈమె రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో భాగంగా రాజ్ తరుణ్ అనుచరులు మూడు సందర్భాలలో తనని దూషిస్తూ తనపై దాడి చేశారని ఈమె వెల్లడించారు.
ఇక తన ఇంట్లో పెంపుడు జంతువులను కూడా చంపేశారని అలాగే తనపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా లాకెళ్లిపోయారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదులో భాగంగా రాజ్ తరుణ్ తో పాటు ఆయన అనుచరులు
మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజ వంటి పలువురిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే కోకాపేట ఇంటిలో జరిగిన దాడి గురించే ఈమె మరోసారి కేసు పెట్టారని తెలుస్తోంది. ఈ ఇంటి గురించి గత కొద్దిరోజులుగా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య వచ్చిన వ్యక్తిగత విభేదాల కారణంగా రాజ్ తరుణ్ 2024 లో ఈ విల్లా ఖాళీ చేశారు. అయితే తాను ఆ ఇంట్లో ఉన్నప్పుడే తనపై రాజ్ తరుణ్ అనుచరులు దాడి చేశారని ఈమె పేర్కొన్నారు.
ఇక రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడంతో మరోసారి ఈ వ్యవహారం సంచలనంగా మారింది. మరి లావణ్య చేసిన ఈ ఫిర్యాదు పై రాజ్ తరుణ్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక రాజ్ తరుణ్, లావణ్య గతంలో రిలేషన్ లో ఉండడమే కాకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారని రాజ్ తరుణ్ కారణంగా తాను ప్రెగ్నెంట్ అయ్యానని, తన చేత బలవంతంగా అబార్షన్ కూడా చేయించారు అంటూ ఈమె ఎన్నో విషయాలను బయటపెట్టారు. అదేవిధంగా లావణ్య డ్రగ్స్ వ్యవహారం గురించి కూడా రాజ్ తరుణ్ అతని స్నేహితులు కూడా సంచలన విషయాలను బయట పెట్టడంతో వీరి వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఇటీవల మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో లావణ్య ఈ వార్తలను ఖండించారు. పాత వీడియోలను ప్రస్తుతం కొందరు ఉద్దేశపూర్వకంగానే విడుదల చేస్తూ తనపై కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు.