ప్రధాని నరేంద్రమోదీ చేసిన పని ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన అభిమాని అయిన రాంపాల్ కశ్యప్ కి ఆయన స్వయంగా ఒక జత బూట్లు తీసుకొచ్చారు. అంతే కాదు, అతడికి బూట్లు తొడిగి లేస్ కూడా కట్టాడు. ఈ సంఘటన హర్యానాలో జరిగింది. ప్రధాని మోదీని కలవడమే అదృష్టంగా భావించిన రాంపాల్, ఆయనే కొత్త బూట్లు తీసుకుని రావడం, స్వయంగా ఇచ్చి లేస్ కట్టడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Rampal Kashyap from Kaithal, Haryana, made a promise 14 years ago to walk barefoot until Narendra Modi became Prime Minister.
Today, PM Modi honored his devotion by gifting him a pair of sneakers and helping him wear them
A vow carved in dust, fulfilled by destiny!! pic.twitter.com/M64jaM2nsO
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 14, 2025
ఎవరీ రాంపాల్ కశ్యప్..
హర్యానా రాష్ట్రంలోని కైతాల్ కి చెందిన రాంపాల్ కశ్యప్.. చిన్నప్పటి బీజేపీ వీరాభిమాని. అంతే కాదు ఆ పార్టీనేత నరేంద్ర మోదీకి ఆయన అంతకంటే పెద్ద అభిమాని. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధించేవారు రాంపాల్. మోదీ పేరు జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న టైమ్ లో రాంపాల్ ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారు. మోదీ ప్రధాని అయ్యే వరకు, ఆయన్ను తాను కలుసుకునే వరకు కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతానని పంతం పట్టారు. అన్నట్టుగానే ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడు. మోదీ ప్రధాని అయినా కూడా రాంపాల్ తన అలవాటు మానుకోలేదు. మోదీని కలిసే వరకు తాను అలాగే ఉంటానని చెప్పేవాడు. అలాగే ఉన్నాడు కూడా.
నేతలు వారించినా..?
మోదీ ప్రధాని అయ్యారు కదా, ఇకనైనా నీ పంతం వీడి చెప్పులేసుకో అంటూ బీజేపీ నేతలు చాలామంది రాంపాల్ ని వారించారు. కానీ ఆయన ఎవ్వరి మాటా వినలేదు. మోదీని కలిసే వరకు, ఆయనతో మాట్లాడే వరకు తాను చెప్పులు వేసుకోనని అనేవారు. మండుటెండల్లో కూడా అలాగే చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ఎక్కడికి వెళ్లినా, ఎంత దూరం వెళ్లినా, బంధువుల ఇంటికి ఫంక్షన్లకి వెళ్లినా కూడా చెప్పులు వేసుకునేవాడు కాదు. కొంతమంది ఎగతాళి చేసినా, చాలామంది విచిత్రంగా చూసినా రాంపాల్ మాత్రం మోదీపై అభిమానంతో చెప్పులు లేని మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎట్టకేలకు నెరవేరిన కోరిక..
దాదాపు 14 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు నెరవేరింది. ప్రధాని మోదీ తానే స్వయంగా రాంపాల్ ని కలిశారు. ఆయనకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇచ్చి కొంత సమయం గడిపారు. రాంపాల్ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్న మోదీ, ఆయనకోసం కొత్త షూ తెప్పించారు. ఆ షూని తానే ఆయనకు అందించారు. అంతే కాదు. షూ వేసుకోడానికి సాయం చేస్తూ లేస్ కూడా కట్టారు. మోదీ-రాంపాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఒక దేశ ప్రధాని.. ఓ సామాన్య కార్యకర్త, అభిమాని కోర్కెను నెరవేర్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. 14 ఏళ్లుగా తన అభిమాన నాయకుడికోసం చెప్పుల్లేకుండా తిరిగిన ఆ కార్యకర్త ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆయన కోసం మోదీ స్వయాగం బూట్లు తీసుకుని రావడం, వాటిని ఆయనకు అందివ్వడం కూడా అరుదైన ఘటన అని ప్రశంసిస్తున్నారు. తనపై చూపించిన ఆ అభిమానానికి మోదీ ముగ్ధుడైనా.. ఇంకెప్పుడూ అలా చెప్పుల్లేకుండా తిరగొద్దని రాంపాల్ కి సూచించారాయన.