Summer Tips: సాధారణంగా సమ్మర్ లో కార్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతుంటాయి. ప్రయాణ సమయంలో ఉన్నట్టుండి వేడి తీవ్రతకు ఇంజిన్ లో మంటలు వచ్చిన సందర్భాలు చాలా చూశాం. కొన్ని వస్తువులను కారులో ఉంచినా మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు 5 రకాల వస్తువులను కారులో అస్సలు ఉండకుండా చూసుకోవాలి. ఇంతకీ ఆ వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వేసవిలో కారులో ఉంచకూడదని 5 వస్తువులు
1.లైటర్లు
వేసవిలో కార్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ లైటర్లు ఉంచకూడదు. ఇవి మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. 70 డిగ్రీల సెంట్రిగ్రేడ్ ఉష్ణోగ్రత నేరుగా లైటర్ మీద పడితే ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు వేసవిలో కార్లలో లైటర్లు ఉండకుండా చూసుకోవడం మంచిది.
2.స్ప్రే, ఫర్ఫ్యూమ్స్
స్ప్రే, ఫర్ఫ్యూమ్స్ కూడా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ వేడి తగిలినప్పుడు మండుతాయి. అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. వీటిని కూడా కారులో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
3.కళ్లజోళ్లు
కళ్లజోళ్లు కూడా కారులో మంటలు చెలరేగడానికి కారణం అవుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కొన్నిసార్లు కళ్లజోడును మందంపాటి గ్లాస్ తో తయారు చేస్తారు. వాటిని డ్యాష్ బోర్డు మీద ఉంచుతారు. అలాంటి సమయంలో ఎండ నేరుగా కళ్లజోడు మీద పడటంతో కొన్నిసార్లు బూతద్దం మాదిరిగా పని చేసి, మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కళ్ల జోళ్లు కారులో ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా, ఎండ నేరుగా పడకుండా చూసుకోవడం ఉత్తమం. లేదంటే కారులో మంటలు వచ్చేందుకు కారణం అవుతాయి.
4.పవర్ బ్యాంక్
సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే పవర్ బ్యాంక్ కూడా కారులో మంటలు చెలరేగేందుకు కారణం అవుతుంది. ఇవి కూడా ఎక్కువ వేడికి గురైనప్పుడు పేలుడుకు గురవుతాయి. అందుకే, వేసవిలో పవర్ బ్యాంక్ లను కారులో వదిలి వేయకూడదు.
5.వాటర్ బాటిళ్లు, డ్రింక్స్
వాటర్ బాటిళ్లు, డ్రింక్స్ కూడా కారు ప్రమాదాలకు కారణం అవుతాయి. చాలా మంది వాటర్ బాటిళ్లు, లేదంటే డ్రింక్స్ బాటిళ్లు గేర్ రాడ్ పక్కన ఉంచుతారు. కారు కుదుపులకు గురైనప్పుడు కిందపడే అవకాశం ఉంటుంది. అవి బ్రేకులు, క్లచ్ ల కిందికి చేరుకుంటాయి. వాటిని గమనించకుండా బ్రేకు వేస్తే, బాటిల్ అక్కడ చిక్కుకోవడం పడవు. ఫలితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంటలు వచ్చి కారు కాలిపోయే అవకాశం ఉంటుంది.
Read Also: పంది రక్తం.. సీతాకోక చిలుక మాంసం.. ప్రపంచంలోనే బెస్ట్ రెస్టారెంట్‌లో వడ్డించేవి ఇవేనట!
సో, వేసవిలో ఎలాంటి కారు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పైన చెప్పిన 5 వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కార్లలో ఉండకుండా చూసుకోండి. ప్రమాదాల నుంచి రక్షించుకోండి.
Read Also: భలే భలే మంచం బండి, ఎలా వస్తాయి బ్రో మీకు ఈ ఐడియాలు!
Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?