Apple Side effects: యాపిల్స్ తినడం చాలా మంచిది, ఎందుకంటే అవి విటమిన్లు, ఫైబర్, ఖనిజాలతో నిండి ఉంటాయి. ‘రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లనవసరం లేదు’ అని కూడా అంటారు. కానీ, ఏదైనా ఎక్కువైతే సమస్యే. యాపిల్స్ ఎక్కువగా తింటే కొన్ని ఇబ్బందులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో, వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం..
యాపిల్స్ వల్ల ఇబ్బందులు
యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి లేదా విరేచనాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
షుగర్ లెవెల్స్ పెరగడం: యాపిల్స్‌లో ఫ్రక్టోస్ వంటి నేచురల్ షుగర్ ఉంటుంది. దీన్ని ఎక్కువ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
యాపిల్స్‌లో కేలరీలు తక్కువగానే ఉంటాయి. కానీ చాలా ఎక్కువ తింటే కేలరీలు పేరుకుపోయి బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్స్‌లో చక్కెర, యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ తింటే పళ్ల ఎనామిల్ దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా పళ్లు సెన్సిటివ్ అవుతాయి లేదా చెడిపోతాయని అంటున్నారు.
కొందరికి యాపిల్స్ తినడం వల్ల దురద, గొంతు నొప్పి లేదా ఊపిరి ఇబ్బంది వంటి అలర్జీలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్ ఎక్కువ తినేసి మిగతా పండ్లు, కూరగాయలు తక్కువ తింటే శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు అందకపోవచ్చట.
ఎలా తగ్గించుకోవాలి?
ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 1-2 యాపిల్స్ తింటే చాలు. ఇది ఆరోగ్యానికి మంచిదట. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావని అంటున్నారు. యాపిల్స్‌తో పాటు అరటి, ద్రాక్ష, నారింజ, కూరగాయలు కూడా తినడం మంచిది. దీని వల్ల అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
యాపిల్ తిన్నాక నీళ్లు తాగడం లేదా నోరు కడుక్కోవడం మంచిది. ఇది పళ్లపై చక్కెర, యాసిడ్స్ ప్రభావాన్ని తగ్గిస్తుందట. షుగర్, కడుపు ఇబ్బందులు ఉంటే యాపిల్స్ తినే ముందు డాక్టర్‌ని అడగాలి. ఖాళీ కడుపుతో యాపిల్స్ తినడం వల్ల కొందరికి అసిడిటీ వస్తుంది. భోజనంతో లేదా స్నాక్స్‌తో తినడం బెటర్. యాపిల్ తిన్నాక ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తినడం ఆపేసి డాక్టర్‌ని కలవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా తింటే సేఫ్
పాడైపోయిన లేదా తాజాగా లేని యాపిల్స్ తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయట. యాపిల్స్‌పై ఉండే పురుగుమందులు, రసాయనాలు పోయేలా శుభ్రంగా కడగాలి.
రోజుకు 1-2 తింటూ, మిగతా పండ్లు, కూరగాయలు కూడా ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావట. ఏదైనా సందేహం ఉంటే డాక్టర్‌ని అడగడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.