Australian Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉన్నఫలంగా… ఇండియన్ వదిలి తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని… ఆస్ట్రేలియన్ క్రికెటర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు అందరూ కలిసి… వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లోని 10 జట్లలో కచ్చితంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు ఒక్కరూ లేదా ఇద్దరు ఉన్నారు.
Also Read: SRH vs KKR Tickets : BCCI కీలక ప్రకటన..ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్
అయితే ఈ అందరు ప్లేయర్లు కలిసి ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారని సమాచారం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఆడాలా ? లేదా ఇంటికి వెళ్ళిపోవాలా అనే దాని పైన చర్చించారట. అయితే ఫైనల్ గా.. మెజారిటీ ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియా వెళ్లిపోవడం చాలా బెటర్ అని.. సూచించినట్టు సమాచారం అందుతుంది.
ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియా కు ప్రయాణం
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో…. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలికి కూడా చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులను కలిసేందుకు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు.. సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తే ఆస్ట్రేలియాకు వెళ్లిపోతామని.. డిసైడ్ అయ్యారట. ఇవాళ లేదా రేపు కచ్చితంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకోబోతున్నారు ఆస్ట్రేలియాన్ ప్లేయర్లు. ఒకవేళ ఆస్ట్రేలియా ప్లేయర్లు… ఐపీఎల్ టోర్నమెంట్ ను… వదిలేసి వెళ్లిపోతే… చాలా జట్లకు నష్టం జరగడం ఖాయం.
వచ్చే వారంలో ఐపిఎల్ 2025 పునః ప్రారంభం
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మరో వారం రోజుల్లో ముగిసే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేవారం మరోసారి మోడీ ప్రభుత్వంతో చర్చించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు అనుకుంటున్నారట. ఆ తర్వాత ఐపీఎల్ పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారట. దానికోసం మళ్లీ రీ షెడ్యూల్ కూడా చేయబోతున్నారని సమాచారం అందుతుంది. దక్షిణ భారతదేశంలో కంటే సౌత్ ఇండియాలోని హైదరాబాద్, వైజాగ్ లేదా ముంబై లాంటి ప్రాంతాల్లో ఐపీఎల్ మిగతా టోర్నమెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.ఇక అటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో రోజు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇండియాలోని 26 ప్రాంతాల్లో డ్రోన్లు వేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టింది. అటు పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లపై టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే మూడింటిని పేల్చింది.
Also Read: Trolls on Curran’s : ప్రమాదంలో సామ్ కర్రన్ ఫ్యామిలీ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల వలలో టామ్ కర్రన్?