E-Paper
Advertisement

OTT Movie : తన అవయవాలను తానే తినే పిల్ల రాక్షసి… గుండె దడ పుట్టించే హారర్ మూవీ

OTT Movie : తన అవయవాలను తానే తినే పిల్ల రాక్షసి… గుండె దడ పుట్టించే హారర్ మూవీ
Advertisement

OTT Movie : ఓటిటిలో ఉన్న సినిమాలలో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరయా అని చెప్పుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే. కథ, టేకింగ్, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఈ జానర్లో వచ్చే సినిమాలు పక్కా బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పొచ్చు. అయితే కొంతకాలం ముందు వరకు హాలీవుడ్, హిందీ లో హారర్ సినిమాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమాల జోరు పెరిగింది. ఇక తాజాగా మనం చెప్పుకోబోయే మూవీ గురించి తెలిస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే. మరి ఈ భయంకరమైన మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలో స్ట్రీమింగ్…

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హారర్ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే కంటెంట్ మీద నమ్మకం ఉండడంతో చిత్ర బృందం రెండు రోజులు ముందే ప్రీమియర్స్ వేసి పాజిటివ్ టాక్ అందుకున్నారు. ఈ తెలుగు హారర్ సినిమాలో ధృవ వాయు హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన 21 రోజుల్లోనే ఈ మూవీ రెండు ఓటీటీలో రిలీజ్ అయింది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీల్లోనూ అక్టోబర్ 4 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా  ప్రగ్యా నయన్ నటించింది. ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ సినిమాని చూడకపోతే వెంటనే ఒక లుక్కెయ్యండి.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

కళింగ అనే పోలిమేరను దాటాక వచ్చే అడవి గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ అడవిలోకి అడుగు పెడితే తిరిగి ప్రాణాలతో రారు అని నమ్ముతారు. అదే ఊరికి చెందిన హీరో అక్కడే సారా కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇక ఆ ఊరికి చెందిన పద్దు అనే అమ్మాయిని ఇతడు ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ తండ్రి మాత్రం వీరి ప్రేమకు ఒప్పుకోడు. పైగా ఊరి పెద్ద దగ్గర తనఖాలో ఉన్న అతని పొలాన్ని విడిపించుకుంటేనే పెళ్లి చేస్తానని ఒక కండిషన్ పెట్టేస్తాడు. అయితే లింగకు అతని తమ్ముడుతో ఉన్న గొడవల కారణంగా పొలం బదులు అడవి దగ్గరలోని భూమిని రాసిస్తారు ఊరి పెద్దలు. తమ పొలాన్ని చూడడం కోసం స్నేహితుడు కలిసి పొలిమేరను దాటి అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది లింగ. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిన లింగకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? పద్దును లింగకు దూరం చేయాలన్న పన్నాగం ఎవరిది? ఈ అన్నదమ్ములకు మధ్య ఎందుకు గొడవలు ఉన్నాయి? కళింగరాజు సంపదకు ఈ స్టోరీ తో సంబంధం ఏంటి? ఆ సంస్థానానికి ఉన్న శాపం, దాని వెనకున్న మిస్టరీ ఏంటి? అనే విషయం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×