BigTV English

OTT Movie : పెళ్లి ఒకరితో, ప్రెగ్నెంట్ మరొకరితో… భర్తకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఇలా చేస్తారా?

OTT Movie : పెళ్లి ఒకరితో, ప్రెగ్నెంట్ మరొకరితో… భర్తకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఇలా చేస్తారా?

OTT Movie : ప్రేమ, పెళ్లి ఈ రెండు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ప్రయాణాలు. వీటిలో ఏది అబద్ధమైనా, జీవితం తల క్రిందలు అవుతుంది. కొందరి జీవితాలలో ఇవి సక్సెస్ అయితే, మరికొందరి జీవితాలలో ఫెయిల్యూర్ గా మిగిలిపోతాయి. అలా ఫెయిల్యూర్ అయిన లవ్ స్టోరీ తో ఒక మలయాళం మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

2024లో విడుదలైన ‘ఉల్లోజుక్కు‘ (Ullozhukku) అనే ఈ మలయాళ మూవీకి  క్రిస్టో టోమీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఊర్వశి, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించగా, అర్జున్ రాధాకృష్ణన్, అలెన్సియర్ లే లోపెజ్, ప్రశాంత్ మురళి, జయ కురుప్ సహాయక పాత్రల్లో నటించారు. 21 జూన్ 2024న విడుదలైన ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అంజు ఒక గార్మెంట్ షాప్ లో పనిచేస్తుంటుంది. రాజీవ్ అనే వ్యక్తి అంజూని ప్రేమిస్తుంటాడు. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అయితే అనుకోకుండా ఒకరోజు అంజు, థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ కాపురం సాగుతున్న క్రమంలో థామస్ అనారోగ్యానికి గురవుతాడు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడ రాజీవ్ అంజూని కలసి తన నెంబర్ ఇస్తాడు. వీళ్ళిద్దరూ మళ్లీ సీక్రెట్ గా కలిసి, ఏకాంతంగా గడుపుతారు. రాజీవ్ తో గడపడం వల్ల అంజు ప్రెగ్నెంట్ కూడా  అవుతుంది. ఈ విషయం అత్త గారికి తెలిసి చాలా సంతోషిస్తుంది. ఒకరోజు థామస్ అనారోగ్యంతో చనిపోతాడు. ఆ తర్వాత అత్తగారితో, ప్రెగ్నెంట్ ఎవరి వల్ల వచ్చింది అనే విషయం చెప్తుంది అంజు. ఇది తెలిసి మరింత బాధపడుతుంది థామస్ తల్లి. అంజు ఎందుకు అలా చేసిందో అర్థం చేసుకుంటుంది థామస్ తల్లి.

అలా జరిగినా కూడా తనతో ఉంటే, నా ఆస్తిపాస్తులు కూడా నీకే ఇస్తానని అంటుంది థామస్ తల్లి . అయితే అంజుకి మాత్రం రాజీవ్ తో బతకాలని ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంజుని, భర్త ఉండగా మరొకరితో ఎలా ఇలా చేశావని తిడతారు. ఈ విషయాలన్నీ రాజీవ్ కి చెప్పి నీతో వచ్చేస్తానని అంటుంది. అయితే రాజీవ్ అత్తగారిచ్చే ఆస్తిని నీపేరు మీద రాయించుకొని రావాలని చెప్తాడు. అతడి ఉద్దేశం నచ్చని అంజు అతనితో వెళ్లడానికి నిరాకరిస్తుంది. చివరికి అంజు ఎవరితో కలసి బతుకుతుంది? రాజీవ్ ని పూర్తిగా వదిలేస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఉల్లోజుక్కు’ (Ullozhukku) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : దొంగ పేర్లతో అమ్మాయిలతో ఆడుకునే సైకో… హీరోనే విలన్ అయితే… మైండ్ బెండయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆచారాల పేరుతో అమ్మాయిలతో ఏకాంతంగా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : మర్డర్ కేసులో ఇరుక్కునే మెంటలోడు… ఆ తల్లి చేసే అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మావా

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

Big Stories

×