Korean Skin:అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ అందుకోసం సమయం కేటాయించే అవకాశం ఉండదు. ఇలాంటి వారు స్కిన్‌కేర్ రొటీన్‌లో గంటలు గడిపే బదులు, మీరు కొన్ని సులభమైన చిట్కాల సహాయంతో కొరియన్ గ్లాసీ స్కిన్ పొందవచ్చు. మీ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేసే కొన్ని కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
అందరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమను తాము అందంగా , పరిపూర్ణంగా మార్చుకోవడానికి చాలా కష్టపడతారు. ఈ రోజుల్లో, అందం , చర్మ సంరక్షణ విషయంలో ప్రపంచంలోనే కొరియన్ బ్యూటీ కేర్ పేరు చాలా చర్చనీయాంశమైంది. ఈ రోజుల్లో కొరియన్ ఫుడ్ నుంచి చర్మ సంరక్షణ వరకు ప్రతిదీ బాగా ప్రాచుర్యం పొందింది.
కొరియన్ స్కిన్ కేర్ చిట్కాలు ఎక్కువగా ఎందుకు ప్రాచుర్యం పొందాయంటే.. దీనికి ప్రధాన కారణం ఇక్కడి ప్రజలు సాధారణంగా తమ అందాన్ని పెంచుకోవడానికి సహజసిద్ధమైన పదార్థాలను వాడడమే. వీటి వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. దీనిని కొరియన్ గ్లాస్ స్కిన్ అని కూడా అంటారు.
బియ్యం నీరు:
ఇది సహజ టోనర్‌గా పనిచేస్తుంది. చర్మం యొక్క pH స్థాయిని క్రమబద్దీకరిస్తుంది. ఇది నల్ల మచ్చలను తగ్గిస్తుంది.అంతే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను కూడా నివారిస్తుంది. దీన్ని తయారు చేయడానికి, బియ్యాన్ని నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేసి చర్మానికి అప్లై చేయాలి. దీంతో మీ చర్మం మెరుస్తుంది.
గ్రీన్ టీ:
పచ్చి పదార్థాలను తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని భావిస్తారు. అయితే కొరియన్లు మాత్రం ఆకుపచ్చని వాటిని చర్మంపై కూడా అప్లై చేయాలని చెబుతారు. ఉదాహరణకు, గ్రీన్ టీ కొరియన్లకు చాలా ఇష్టమైనవి. జిడ్డు, మొటిమలు ఉన్న వారి చర్మానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. తరుచుగా గ్రీన్ టీ త్రాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
పాలు, తేనె:
పాలు, తేనె పర్ఫెక్ట్ కొరియన్ క్లెన్సర్‌గా పనిచేస్తాయి. క్రిస్టల్ క్లియర్ స్కిన్ , షైన్ కోసం, పాలు , తేనె మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది . ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది.
Also Read: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది
బోరిచా:
ఇది ఒక రకమైన బార్లీ టీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి చర్మానికి అంతర్గత పోషణను అందిస్తాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ప్రజలు గ్రీన్ టీ తాగినట్లే, కొరియన్లు తమ అందం , చర్మ సంరక్షణ దినచర్యలో బోరిచా తాగుతారు. దీంతో చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.