BigTV English

Korean Skincare Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. కొరియన్‌ గ్లాసీ లుక్‌ సొంతం.

Korean Skincare Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. కొరియన్‌ గ్లాసీ లుక్‌ సొంతం.

Korean Skincare Tips For Healthy and Glass Skin: కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటే నేటి కాలం యువతలో సూపర్ క్రేజీ ఉంటుంది. ఇక కొరియన్ భామలు అందానికి ఫిదా అవ్వనివారుండరు. సాధారణంగా చాలా మంది అమ్మాయిలకి కొరియన్ భామల్లా మెరిసే చర్మం, గ్లాసీ స్కిన్ కావాలని కోరుకుంటారు. అయితే వారిలాగా మెరిసే చర్మం కావాలంటే స్కిన్ కేర్ చాలా ముఖ్యం. ఇందుకోసం మంచి పోషకాహారం తీసుకోవాలి. స్కిన్ పై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొరియన్ భామల్లా మీ స్కిన్ కూడా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.


బియ్యం పిండి, అలోవెరా ఫేస్ ప్యాక్
కొరియన్ అమ్మాయిలు ఎక్కువగా బియ్యంపిండిని ఉపయోగిస్తారు. బియ్యం పిండిలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్నాయి. బియ్యంపిండిని ముఖానికి అప్లై చేస్తే స్కిన్ గ్లోయింగ్‌గా మారుతుంది. ఇందుకోసం ముందుగా మూడు టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో అలోవెరా జెల్ వేసి వాటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ చర్మం మృదువుగా మారుతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

బియ్యం నీళ్లతో ఫేస్ వాష్
మనం ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకోవాలంటే.. రకరకాల సబ్బులు, క్రీములు ఉపయోగిస్తారు. కానీ కొరియన్ భామలు అయితే బియ్యం నీళ్లనే ఎక్కువగా ఫేస్ వాష్‌గా వాడుతుంటారు. రైస్ వాటర్ ఎక్కువ రోజులు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది నాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా రైస్ వాటర్‌ని ఉపయోగించండి. రైస్ వాటర్ కోసం ముందుగా బియ్యంని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.


బొప్పాయి, పాలు, తేనె ఫేస్ ప్యాక్
బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ తేనె, రెండు స్పూన్ పాలు, కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మీ స్కిన్ గ్లోయింగా మారుతుంది.

Also Read: రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి నష్టమే.. ఎలాగంటే?..

బియ్యంపిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
బియ్యం పిండిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా నెలకు రెండు, మూడు సార్లు చేస్తే స్కిన్ కాంతివంతంగా మారుతుంది.

రైస్ వాటర్, ముల్తాని మిట్టి, విటమిన్ ఇ కాప్యూల్స్
ముల్తాని మిట్టిలో రైస్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి వాటిని మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ ముఖం ఖచ్చితంగా మెరిసిపోవడం ఖాయం.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×