BigTV English

Drinking Orange Juice Daily: రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి నష్టమే.. ఎలాగంటే?..

Drinking Orange Juice Daily: రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి నష్టమే.. ఎలాగంటే?..

Drinking Orange Juice Daily| నగర జీవినానికి అలవాటు పడ్డ చాలామందికి ప్రతిరోజూ టిఫిన్ తరువాత ఆరెంజ్ జ్యూస్ తాగడం అలవాటు. లేదా వ్యాయామం చేసిన తరువాత ఆరెంట్ జ్యూస్ తీసుకుంటారు. ఆరెంజ్ జ్యూస్ లో మంచి పోషకాలు ఉండడంతో పాటు ఉదయం వేళ తాగితే శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. అయితే ఆరెంజ్ జ్యూస్ వల్ల లాభాలు ఉన్నా.. ప్రతి రోజూ తాగడం వల్ల ఆరోగ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది.


ముందుగా ఆరెంజ్ జ్యూస్ వల్ల ఆరోగ్య లాభాలు ఏంటో చూద్దాం

రోగ నిరోధక శక్తి: ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో దాని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పు వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు రాకుండా రోగ నిరోధక శక్తి కాపాడుతుంది.


మెరిసే చర్మం: చర్మం కాంతివంతంగా మారేందుకు, చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉండేందుకు విటమిన్ సి అవసరం. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఉండడంతో మీరు దీన్ని తాగితే ఎక్కువ కాలం మీ చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడి హాని కలిగిస్తాయి.

Also Read: డాండ్రఫ్ తో బాధపడుతున్నారా?.. ఈ చిట్కాలు మీ కోసమే..

ఎముకలకు బలం: ఆరెంజ్ లో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానాకి చాలా అవసరం. కాల్షియం తగిన మోతాదులో లభిస్తుంటే ఎముకలు బలంగా ఉంటాయి. మన శరీరమంతా ఎముకల అస్తిపంజరమే కాబట్టి.. దాన్ని బలంగా ఉంచుకోవడానికి ఆరెంజ్ జ్యూస్ ఉపయోగపడుతుంది. మోకాళ్లు, కీళ్లల్లో వాపు కారణంగా నొప్పి ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్ తాగితే అందులోని నారిన్ జెనిన్, హెస్పరిడిన్ ఫ్లవనాయిడ్స్ తో వాపు సమస్య తగ్గిపోతుంది.

కిడ్నీ స్టోన్స్ : ఆరెంజ్ ఒక సిట్రస్ ఫ్రూట్ కావడంతో దాని జ్యూస్ లో సిట్రేట్ కాన్సట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రేట్ కాన్సట్రేట్ కిడ్నీలో ఏర్పడే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ని బ్రేక్ చేస్తుంది. అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడ కుండా ఆరెంజ్ జ్యూస్ ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది:
ఆరెంజ్ జ్యూస్ లోని హెస్పరిడిన్ శరీరంలో హైపర్ టెన్షన్ (హైబిపి) ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఆరెంజ్ పండు లో పెక్టిన్, లిమినాయిడ్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి గుండె లోని అర్టరీస్ గట్టిపడకుండా అడ్డుపడతాయి. అంతే కాకుండా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది.

Also Read: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఇవే సమస్యలు
న్యూట్రషినిస్ట్ రూపాలి దత్తా ప్రకారం.. ఆరెంజ్ జ్యూస్ ప్రతిరోజూ తాగకూడదు. వారంలో మూడు నాలుగు రోజులు తాగితే మంచిది. ప్రతి రోజు తాగితే ఆరోగ్యంపై దుష్రబావాలుంటాయి. అవి ఏంటంటే..

ఆరెంజ్ జ్యూస్ లో ఫైబర్ ఉండదు: సాధారణంగా కూరగాయలు, పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తికి తోడ్పపడుతుంది. ఆరెంజ్ పండులో కూడా ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది. కానీ దాన్ని జ్యూస్ గా చేయడం వల్ల దానిలోని ఫైబర్ కోల్పోవాల్సి వస్తుంది. ఫైబర్ లేకుండా ఆరెంజ్ జ్యూస్ అంటే అది కేవలం కొన్ని పోషకాలు కలిగిన తీయని నీరు మాత్రమే. ఫైబర్ జీర్ణశక్తిని పెంచడంతో పాటు మలినాలను తొలగించి, శరీరంలో షుగర్ ప్రభావాన్ని స్లో చేస్తుంది.

ఎక్కువ శాతంలో షుగర్ : ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ చేసుకోకుండా మార్కెట్ లో లభించే ప్యాకేజీ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. కానీ ప్యాకింగ్ ఆరెంజ్ జ్యూస్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. పైగా అది రుచిగా ఉండేందుకు అందులో కలర్, ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఒకవేళ ఇంటి వద్ద జ్యూస్ తయారు చేసుకున్నా చాలామంది అందులో ఎక్కువ చక్కెర్ కలుపుతారు. ఇది షుగర్ సమస్య ఉన్నవారికి మంచిది కాదు. పైగా ఇలాంటి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో షుగర్ శాతం వేగంగా పెరిగిపోతుంది. అందుకే జ్యూస్ తాగడం పండ్లను నేరుగా తినడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.

డంపింగ్ సిండ్రోమ్ : డంపింగ్ సిండ్రోమ్ అంటే మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకుండానే కడుపులో నుంచి చిన్నపేగులోకి త్వరగా వెళ్లిపోతుంది. దీనివల్ల శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి పెరిగిపోయే ప్రమాదముంది. కొందరికి కడుపులో నొప్పి, వాంతులు కూడా వస్తాయి. ఇలా ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగే వారికి జరిగే అవకాశముంది.

అందుకే వైద్య నిపుణులు ఆరెంజ్ జ్యూస్ ని ప్రతిరోజూ తాగకుండా అప్పుడప్పుడూ తీసుకుంటే మంచిదని, అదికూడా పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×