BigTV English

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఏదొక పదం పొరపాటుగా చెప్పి.. ట్రోల్ కు గురవుతుంటారు. యథావిధిగా ఈసారి పెట్టిన ప్రెస్ మీట్ లోనూ ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. 100 రోజుల చంద్రబాబు పాలనపై మాట్లాడిన జగన్.. తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి ఎందుకు తీసుకొచ్చారో వివరిస్తూ.. నోరుజారారు. ఆయన చెప్పే విషయాలన్నీ స్క్రిప్టెడే అయినా.. కొన్ని పదాలను పలకడం ఇంకా సరిగ్గా రావడం లేదు పాపం.


తిరుమల బోర్డు మెంబర్ల ఎంపిక, వైవీ సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతూ.. ఆయన 45 సార్లు అయ్యప్పస్వామి మాల వేసుకున్నారని, ఆయన సూపర్ స్వామి అని, తిరుమల ఈఓగా అంతకుమించిన భక్తుడు ఉండడన్నారు. అక్కడే ఉన్న రిపోర్టర్లు.. గురుస్వామి అంటారని చెప్పడంతో.. ఆ పదాన్ని కరెక్ట్ చేసుకున్నారు జగన్.

ఆ తర్వాత.. చంద్రబాబు దేశంలో ఉన్న ఆలయాలను ధ్వంసం చేయించాడని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు వైసీపీ హయాంలోనే పునరుజ్జీవం వచ్చేలా మరమ్మతులు చేశామని చెప్పడానికి అష్టకష్టాలు పడ్డారు. జీర్ణావస్థ అనేందుకు నోరుతిరగక.. జీర్ణ వ్యవస్థ అని పలికారు. ఇవి గమనించిన ట్రోలర్స్ ఊరికే ఉంటారా మరి. జగన్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.


Also Read: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

తిరుమల లడ్డూ కాంట్రవర్సీ గురించి మాట్లాడిన జగన్.. ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపించారు. దేవుడిని కూడా రాజకీయానికి వాడుకున్న చంద్రబాబు వంటి దుర్మార్గుడు ఇంకెక్కడా ఉండబోడన్నారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలకు మూడు దశల్లో క్వాలిటీ చెక్ ఉంటుందని, వాటిలో పాస్ అవ్వకపోతే వాటిని లడ్డూ తయారీకి వాడే ఛాన్సే లేదన్నారు. తమ హయాంలో 18సార్లు అలా రిజెక్ట్ అయ్యాయని, అలాంటిది నెయ్యిలో కల్తీ జరుగుతుందన్న విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం అమలు చేయని హామీల గురించి ప్రశ్నిస్తారనే ఇలాంటి నీఛ రాజకీయాలకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీకి, సీజేఐ కి ఈ విషయంపై లేఖ రాస్తానని తెలిపారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×