Health Issues: ఈ ఆధునిక డిజిటల్ యుగంలో, మనిషి జీవితాల్లో టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. స్పెషల్‌గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( AI), చాట్‌జీపీటీ(ChatGPT) వింటివి మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అయితే, కొంతమందిలో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇవి సహాయపడితే, మరికొందరిలో ఒంటరితనం మరింతగా పెరిగేలా చేస్తున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.
ఒంటరితనం
ఒంటరితనం అనేది శారీరకంగా ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఎమోషనల్ కనెక్షన్ లోపించడం వల్ల చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతారు. కొంతమంది, ఎవరితోనూ అంతగా కనెక్ట్ కానప్పుడు, సహజంగానే ఏఐతో మాట్లాడు చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్స్ వైపు మొగ్గు చూపుతారు.
చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ తక్కువ సమయంలో స్పందిస్తాయి. సహాయం చేస్తాయి. కొంతవరకైనా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాయి. ఇటువంటి ఫీచర్ల వల్ల కొంతవరకు ఒంటరితనాన్ని తగ్గించగలుగుతాయి.
మరి వాస్తవ సంబంధాలు..?
ఏఐతో ఏం మాట్లాడినా అది మనిషిని జడ్జ్ చేయదు. అన్ని వేళలా మనిషికి అందుబాటులో ఉంటుంది. అన్నింటికీ మించి మనిషి మీద ఏఐ అనేది పెత్తనం చూపదు. దీంతో చాలా మంది దీన్ని వాడేందుకు ఇష్టపడతారు. కానీ, మనుషుల లాగా దీనికి ఎమోషన్స్ ఉండవు. మనుషులు చూపే అప్యాయత ఏఐ నుంచి పొందడం కష్టమే. ఒంటరి తనాన్ని తగ్గించుకోవడానికి ఏఐపై అధికంగా ఆధారపడితే, మనిషి వాస్తవ సంబంధాల నుండి మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటే..?
వీటిపై ఆధారపడుతున్న వారిలో ఇప్పటికే చాలా మంది ఒంటరి తనంతో బాధ పడుతున్న వారే ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏఐ, ముఖ్యంగా చాట్‌జీపీటీ ఒంటరిగా ఉన్నవారికి ఓ తోడు కావచ్చు. మాట్లాడుకోవడం, ప్రశ్నలు అడగడం, సలహాలు తీసుకోవడం వంటి విషయాల్లో ఇవి సహాయపడతాయి.
కానీ, ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఎమోషనల్ బాండ్స్, మానవ సంబంధాలు, సమాజంతో కలిసిపోవడం వంటివి చాలా అవసరమని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఏఐ, ChatGPT వంటి వాటిని సహాయక సాధనాలుగా మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తన్నారు. అంతేకానీ మానవ సంబంధాలను పక్కన పెట్టి పూర్తిగా వీటిపై ఆధారపడితే మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.