CM Revanth Reddy : జపాన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి నిధుల వేట షురూ చేశారు. మారుబేని కంపెనీతో ఫస్ట్ మీటింగ్ సక్సెస్ అయింది. ఫ్యూచర్ సిటీలో 1000 కోట్ల పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆ ప్రాజెక్టు పూర్తైతే సుమారు 30 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఆ తర్వాత సోనీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ తరహాలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీ నెలకొల్పాలనే తన విజన్‌ను ఆవిష్కరించారు.
జైకాతో పైసా వసూల్
అటు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) అత్యున్నత స్థాయి యాజమాన్యంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని కోరింది. మెట్రో రైల్ రెండో దశ పనులకు.. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు.. రీజనల్ రింగ్ రోడ్డు RRR నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ORR వరకు ఇంటర్ కనెక్టింగ్ రేడియల్ రోడ్లు వేసేందుకు.. ఇతర మౌలిక వసతుల కల్పనకు.. ఆర్థిక సాయం అందించాలని జైకాను కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.
టోక్యో, న్యూయార్క్ తరహాలో హైదరాబాద్
కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా రూ.24 వేల 269 కోట్ల అంచనాలతో చేపడుతున్న మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అవసరమమ్యే ఖర్చులో 48 శాతం నిధులు.. రూ.11,693 కోట్ల రుణం అందించాలని రిక్వెస్ట్ చేశారు. మెట్రో పనులతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టునకు.. రేడియల్ రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని జైకాను అడిగారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ సిటీని టోక్యో, న్యూయార్క్ తరహా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి జైకా మీటింగ్‌లో వివరించారు.
Also Read : ఓ చిన్నారిపై పేపర్లో న్యూస్.. సీఎం రేవంత్ ఏం చేశారంటే…
జైకాకు, తెలంగాణతో ఏళ్లుగా మంచి సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు. ఈ మీటింగ్‌లో సీఎంతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.