Osteoporosis In Men| ఎముకల బలహీనత సమస్యను వైద్యపరిభాషలో “ఆస్టియోపోరోసిస్” అని అంటారు. మహిళల్లో ఈ సమస్య ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వస్తుంది. కానీ ఇదే సమస్య పరుషుల్లో కూడా అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన చాలా మంది పురుషులు ఎముకల బలహీనతకు గురయ్యే ఈ నిశ్శబ్ద వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్యకు ఒక ముఖ్య కారణం తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు. దీనివల్ల ఎముకల బలహీనంగా
గురుగ్రామ్ లోని మెడాంటా హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ డైరెక్టర్.. డాక్టర్ వినీష్ మాథుర్ ప్రకారం.. పురుషుల్లో ఎముకల క్షీణత నెమ్మదిగా, నిశ్శబ్దంగా జరుగుతుంది. చాలా సార్లు, ఎముక పగిలినప్పుడే ఈ సమస్య తెలుస్తుంది. అప్పటికే ఎముకలు గణనీయంగా బలహీనపడి ఉంటాయి. పగుళ్ల నుండి కోలుకోవడం పురుషులకు మహిళల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇందుకు ఒక కీలక కారణం టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం.
టెస్టోస్టెరాన్ మరియు ఎముకల బలంటెస్టోస్టెరాన్ కేవలం కండరాల బలం లేదా లిబిడో కోసం మాత్రమే కాదు, ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ఇది కొత్త ఎముకల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఉన్న ఎముకల క్షీణతను నిరోధిస్తుంది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎముకల క్షీణతను వేగవంతం చేసి, తుంటి, వెన్నెముక, మరియు మణికట్టు వంటి భాగాల్లో పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమస్యకు కారణాలు వివిధం కావచ్చు—వయస్సు, స్టెరాయిడ్స్ వంటి మందులు, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, లేదా కొన్ని మందుల వాడకం. ఈ లక్షణాలు—అలసట, కండరాల బలహీనత, లైంగిక ఆసక్తి తగ్గడం, లేదా ఎప్పుడైనా జారి పడడంతో ఎముకలు పగిలిపోతే.. ఈ లక్షణాలను సాధారణ వృద్ధాప్య సమస్యగా అందరూ భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
హెచ్చరిక సంకేతాలు ఆస్టియోపోరోసిస్‌ను “నిశ్శబ్ద వ్యాధి” అంటారు. ఎందుకంటే ఇది లక్షణాలు లేకుండా ముందుకు సాగుతుంది. కానీ, నీరసం, వెన్నునొప్పి, ఎత్తు తగ్గడం, శరీర భంగిమ వంకరగా మారిపోవడం, లేదా అకస్మాత్తుగా ఎముకలు పగలడం వంటి సంకేతాలు ఈ వ్యాధిని సూచిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి.. ఎముకల సాంద్రత పరీక్ష, హార్మోన్ స్థాయిల పరీక్ష చేయించుకోవాలి.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆస్టియోపోరోసిస్‌ను నివారించడం లేదా నియంత్రించడం సాధ్యమే. వారానికి కొన్ని సార్లు బరువు ఎత్తే వ్యాయామాలు చేయడం ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, మద్యపానం తగ్గించడం కూడా ఉపయోగకరం. తక్కువ టెస్టోస్టెరాన్ సమస్య ఉంటే.. హార్మోన్ థెరపీ ఒక ఎంపిక కావచ్చు, కానీ దీనిని వైద్య సలహాతోనే చేయాలి.
Also Read: స్నాక్స్ తింటూ బరువు తగ్గొచ్చు.. ఇలా చేస్తే ఎంత తిన్నా ఫర్వాలేదు
ఆస్టియోపోరోసిస్ కేవలం మహిళల సమస్య కాదు. పురుషులకు కూడా ఈ ప్రమాదం ఎక్కువ అని నిపుణలు చెబుతున్నారు. 50 ఏళ్లు దాటిన పురుషులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సమస్యను ముందుగానే గుర్తిస్తే, దానిని సమర్థవంతంగా చికిత్స చేయొచ్చు.