BigTV English

Lucky Plants: ప్రతి ఇంట్లో.. తప్పకుండా ఉండాల్సిన మొక్కలు !

Lucky Plants: ప్రతి ఇంట్లో.. తప్పకుండా ఉండాల్సిన మొక్కలు !

Lucky Plants: కొన్ని రకాల చెట్లు, మొక్కలు చాలా అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్కలు ఇంట్లోని గాలిని శుభ్రం చేయడమే కాకుండా సంపద, శ్రేయస్సు, గౌరవాన్ని పెంచుతాయి. అందుకే ఈ చెట్లు, మొక్కలు కూడా ప్రతి ఇంట్లో తప్పకుండా నాటాలి.


ఈ మొక్కలు ఉన్న ఇళ్లలో శ్రేయస్సు ఉంటుంది. అంతే కాకుండా శుభం కలుగుతుందని నమ్ముతారు. ఈ మొక్కలు సంపద, ఆనందం, శ్రేయస్సును ఆకర్షిస్తాయని వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి ఎలాంటి మొక్కలు ఇంట్లో తప్పకుండా పెంచాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జాడే మొక్క:
చిన్న గుండ్రని ఆకులు కలిగిన ఈ అందమైన జాడే మొక్క ప్రతి ఇంట్లోనూ ఉండాలి. జాడే మొక్క ఇంటికి అదృష్టం , శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఇది ఆఫీసు డెస్క్ లేదా ఇంటికి అనువైన మొక్క. ఇది అభివృద్ధికి ప్రతీక అని కూడా చెబుతారు. విజయం, సంపదను ఆకర్షించడంలో జాడే మొక్క చాలా ప్రభావ వంతమైనదిగా పరిగణించబడుతుంది.


పీస్ లిల్లీ:
పీస్ లిల్లీ అనేది ఎక్కువ కేర్ తీసుకోకపోయినా కూడా పెరిగే మొక్క. దీనిని మీరు ఇంటి లోపల లేదా ఆరుబయట కూడా పెంచుకోవచ్చు. ఇది ఇంట్లో లేదా ఆఫీసులో అదృష్టం, శాంతిని తెచ్చే మొక్కగా చెబుతారు. దీన్ని ఇంటి లోపల పెంచడం కూడా చాలా సులభం. ఇది గాలిని శుద్ధి చేసే మొక్క. అంతే కాకుండా ఇది గదిని తాజాగా ఉంచుతుంది. అంతే కాకుండా ఈ మొక్క శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. శాంతిని పెంపొందించడానికి , స్థలం నుండి ప్రతికూల శక్తిని తరిమికొట్టడానికి మీరు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా పడకగదిలో పీస్ లిల్లీ మొక్కను పెట్టుకోవచ్చు.

వెదురు మొక్క:
వెదురు మొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఇండోర్ ప్లాంట్లలో ఒకటి. దీనిని పెంచడం చాలా సులభం. ఇది ఇంటి అలంకరణకు కూడా సరైన మొక్క. ఫెంగ్ షుయ్ ప్రకారం, వెదురు మొక్క మీ ఇంటికి అదృష్టం , శ్రేయస్సును తెస్తుంది. ఈ లక్కీ వెదురు మొక్కకు నీళ్లు కూడా తక్కువగానే అవసరం అవుతాయి. మొక్కల పెరుగుదల బాగా ఉండాలంటే ప్రతి 3-4 రోజులకు ఒకసారి నీటిని మార్చాలి. ఇది ఆఫీసు డెస్క్, లివింగ్ రూమ్, బెడ్ రూమ్ అలంకరించడానికి చాలా మంచిది.

తులసి మొక్క:
హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్ర మైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంటి ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో నాటి ప్రతిరోజూ పూజించడం మంచిది. మత విశ్వాసాల ప్రకారం, ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతాయి. అంతే కాకుండా అనేక రకాల సమస్యలను దూరంగా ఉంటాము. తులసిని విష్ణువు, లక్ష్మీ దేవికి సంబంధించినదిగా భావిస్తారు. ఇంట్లో తులసి ఉండటం వల్ల అదృష్టం పెరుగుతుంది. అందుకే దీనిని శ్రీ తులసి అని పిలుస్తారు.

మనీ ప్లాంట్ :
ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం మంచిదని భావిస్తారు. దాని పేరుకు తగ్గట్టుగానే ప్లాంట్ డబ్బు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ మొక్క పెరిగే కొద్దీ, సంపద , గౌరవం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ మొక్క భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్ర గ్రహానికి సంబంధించింది.మనీ ప్లాంట్ ఇంట్లో అదృష్టాన్ని పెంచుతుంది. అంతే కాకుండా జీవితంలోకి కొత్త శక్తిని తెస్తుంది.

తమలపాకు మొక్క:
తమలపాకు మొక్కలు ఆరోగ్యం, శాంతి , శ్రేయస్సుకు దారితీస్తాయి. ఇంటికి అదృష్టాన్నిచ్చే ఈ మొక్కలు ప్రతికూల శక్తులను తొలగించి సానుకూలతను ఆకర్షిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు.ఈ మొక్కలు గాలి నుండి సాధారణ కాలుష్య కారకాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇంట్లో తేమను కూడా మెరుగుపరుస్తాయి.

Also Read: కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !

స్నేక్ ప్లాంట్:
‘సంస్కృత మొక్క’ అని కూడా పిలువబడే స్నేక్ ప్లాంట్. కత్తుల మాదిరిగా కనిపించే పొడవైన, నిటారుగా ఉండే ఆకులను ఈ మొక్క కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఆనందం, శాంతి శ్రేయస్సును అందిస్తుంది. ఈ మొక్క ప్రతికూల శక్తిని దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలను తొలగించి ఇంటికి సంపదను తెస్తుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×