Jabardast Rohini:జబర్దస్త్ రోహిణి (Jabardast Rohini).. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత జబర్దస్త్ (Jabardast)కార్యక్రమంలోకి వచ్చి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాలు, ఓటీటీలు, బుల్లితెర షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇక బిగ్ బాస్ (Bigg Boss) షో తో గత ఏడాది రోహిణి బాగా ట్రెండ్ అయిందని చెప్పాలి. ఇప్పుడు రోహిణి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టానని, సొంత ఊర్లో సొంత ఇంటి కల నెరవేరింది అంటూ పోస్ట్ పెట్టి అభిమానులకు అసలు విషయాన్ని తెలియజేసింది. ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ ను ఆమె ఇలా వాడేసిందని అందరూ కామెంట్లు చేస్తున్నారు.
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న రోహిణి..
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన చాలామంది తమ సొంత ఇంటి కలను, సొంత కార్లను కొనుగోలు చేసి తమ కలను నెరవేర్చుకున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఫ్లాట్లు కొనుగోలు చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటే .. అటు శివ జ్యోతి (Siva Jyothi) కూడా పలుమార్లు ఫ్లాట్లు మారుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. ఇటీవల ఆదిరెడ్డి (Adi Reddy) కూడా సొంత ఇంట్లోకి అడుగు పెట్టాడు. మరొకవైపు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj) కూడా బెంజ్ కారు కొనుగోలు చేశారు. ఇలా ఒక్కొక్కరు తమ ఇష్టాలకు అనుగుణంగా బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ను బాగా వాడేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు రోహిణి వంతు వచ్చింది. ఆమె కూడా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసిన ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇక అంతా శుభమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రోహిణి తన అమ్మానాన్నలతో కలిసి ఇలా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఇక మరొకవైపు హౌస్ లో ఉన్నప్పుడే అటు ఫ్యామిలీ గురించి ఇటు బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి అందరికీ మరింత దగ్గరయ్యింది. ఇక హౌస్ లో ఉన్నంతసేపు తోటి కంటెస్టెంట్ గౌతమ్ ను ఇష్టపడుతూ వచ్చింది. కానీ చివర్లో తాను అక్క అని పిలిచేసరికి అప్సెట్ అయిపోయింది రోహిణి.
Priyanka Chopra: 3 లగ్జరీ అపార్ట్మెంట్స్ ను అమ్మేసిన SSMB 29 బ్యూటీ.. ఏమైందంటే..?
వెబ్ సిరీస్, సినిమాల ద్వారా భారీ గుర్తింపు..
ఇక ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తున్న ఈమె.. తాజాగా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్లలో ఈమెకు లేడీ కమెడియన్ గా ఆఫర్లు ఇస్తున్నారు. అసలే ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ల కొరకు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని రోహిణి భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది అని అందరూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ వేదికగా తన టాలెంట్ ను ఉపయోగించి, అందర్నీ ఎంటర్టైన్ చేసిన ఈమె.. దీనికి తోడు ‘ సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ లో కూడా అందర్నీ ఆకట్టుకుంది. ఈ రెండు సీజన్లో కూడా తన స్టామినా ఏంటో నిరూపించింది రోహిణి.