BigTV English

Reasons Of Dark Circles : కళ్ల క్రింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు ఇవే !

Reasons Of Dark Circles : కళ్ల క్రింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు ఇవే !

Reasons Of Dark Circles: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో కంటి కింద నల్ల వలయాలు కూడా ఒకటి. చిన్నా.. పెద్దా తేడా లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు రోజుకు పెరుగుతున్నారు. సరిగా నిద్రలేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లను చూడడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి.


అంతే కాకుండా ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అయినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలు కూడా డార్క్ సర్కిల్స్ రావడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్:
ఈ హార్మోన్ లోపం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ గ్రంథి హార్మోన్లు సరిగా విడుదల చేయకపోతే గ్రంథి పనితీరు కూడా దెబ్బతింటుంది. ఫలితంగా హార్మోన్లు ఎక్కువగా లేదా తక్కువగా విడుదలవుతాయి. ఇలా జరగడం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.


రక్త హీనత:
ఎర్ర రక్త కణాల సంఖ్య శరీరంలో తగ్గితే డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. ఐరన్ లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గుతాయి. ఈ కారణంగా ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు తగినంత పరిమాణంలో సరఫరా కాదు. ఆక్సిజన్ లోపం చర్మాన్ని పాలిపోయేలా చేస్తుంది. అంతే కాకుండా నిస్తేజంగా మారుస్తుంది. రక్త నాళాలు ముదురు రంగులో మారడానికి కూడా ఇది కారణమవుతుంది. ఫలితంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి.

డీహైడ్రేషన్:
ఒక వ్యక్తి ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీరు తాగడం అవసరం అంతకంటే తక్కువ నీరు తాగితే డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ లోపం:
శరీరంలో విటమిన్ డి, కే, ఇ, బీ లోపం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కళ్ల క్రింద నల్లటి వలయాలు ఏర్పడి అవి చాలా కాలం ఉంటాయని అంటున్నారు. ముందుగానే వైద్యులను సంప్రదించి ఇందుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని తగిన మందులు వాడటంమంచిది. విటమిన్ కే ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునే మహిళల్లో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

హైపర్ పిగ్మెంటేషన్ :
సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ లేకుండా సూర్యరశ్మికి ఎక్కువసేపు బహిర్గతం కావడం వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. శరీరంలో మెలనిన్ అధికంగా ఉండటం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చర్మవ్యాధులు:
కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి చర్మ వ్యాధులు కూడా ఓ కారణం. చర్మం పొడిబారడం, ఎర్ర బడటం, వాపు వంటి సమస్యల వల్ల డార్క్ సర్కిల్స్ ప్రమాదం పెరుగుతుంది. కళ్ల దగ్గర రక్తనాళాలు వ్యాకోచించి చర్మంపై నల్లగా కనిపిస్తుంది. అంతే కాకుండా అలర్జీల కారణంగా కూడా కంటి వలయాలు ఏర్పడతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×