BigTV English

Fruits for Skin: ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనపడకూడదంటే ఈ ఏడు పండ్లను తినడం అలవాటు చేసుకోండి

Fruits for Skin: ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనపడకూడదంటే ఈ ఏడు పండ్లను తినడం అలవాటు చేసుకోండి

Fruits for Skin: చర్మం యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కాలుష్యం వల్ల, పోషకాహార లోపం వల్ల చర్మం ముడతలు, గీతలు పడి వృద్ధాప్యాన్ని ముందే ఆహ్వానిస్తుంది. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు రాసినా కూడా యవ్వనమైన చర్మాన్ని పొందడం కష్టంగా మారిపోతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా చర్మానికి మేలు చేసే ఏడురకాల పండ్లను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడి లేకుండా జీవించాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లను, కూరగాయలను తినడం ద్వారా వృద్ధాప్యం రాకుండా అడ్డుకోవచ్చు.


దానిమ్మ
ఈ పండులో అద్భుతమైన యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇది శరీరాన్ని పోషకాలతో నింపుతుంది. దానిమ్మ పండులోని అణువులు, జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులతోని కలిసి వృద్ధాప్యాన్ని రాకుండా అడ్డుకుంటాయని చెబుతారు. దానిమ్మలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణం ఉంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉంటాయి.

బొప్పాయి
బొప్పాయి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సూక్ష్మ పోషకాలను శరీరానికి అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో చర్మం డామేజ్ కాకుండా కాపాడుతుంది. బొప్పాయిలో విటమిన్లో ఫాస్పరస్, క్యాల్షియం, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ముడతలు, గీతలు పడకుండా చర్మాన్ని కాపాడుతాయి.


కివి
ఈ పండును ప్రతిరోజు ఒకటి తినండి చాలు.  మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, న్యూట్రియెంట్లు శరీరానికి అందించి మీ రూపాన్ని యవ్వనంగా మారుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.  ఇందులో ఉండే విటమిన్ సి… శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read: ప్రతి రోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?

అరటిపండు
అరటి పండులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ బి, పొటాషియం, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో ఉండే పొటాషియం చర్మాన్ని కాపాడుతుంది. ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలు రాకుండా అడ్డుకుంటుంది.

పుచ్చకాయ
వాటర్ మెలన్‌లో 92 శాతం నీరే ఉంటుంది. కాబట్టి చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది సూర్యుడు నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి నిండుగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.

నారింజపండు
నారింజ తినడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. నారింజలు తినేవారిలో చర్మంపై ముడతలు రావు. ఇలాంటి క్రీములు రాయాల్సిన అవసరం లేకుండానే చర్మానికి మెరుపు వస్తుంది.

చిలకడదుంప
దీనిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్లో ఇది తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. చర్మంపై గీతలు, ముడతలు రాకుండా వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేస్తుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×