Mango Buying Tips: సమ్మర్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు మామిడి పండ్లతో నిండిపోతాయి. కానీ ఈ మామిడి పండ్లు ఇంత త్వరగా ఎలా పక్వానికి వస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? నిజానికి.. మామిడి పండ్లను చాలా వరకు రసాయనాలతో పండిస్తారు. మరి ఇలాంటి సమయంలోనే మనం నేచురల్ గా పండించిన పండ్లను కొనడం కష్టం అనే చెప్పాలి.
FSSAI ప్రకారం.. సాధారణంగా పండ్లను త్వరగా మగ్గించడానికి ఉపయోగించే రసాయనం కాల్షియం కార్బైడ్..ఇది విషం కంటే తక్కువేమీ కాదు. ఇందులో ఆర్సెనిక్ , భాస్వరం వంటి హానికరమైన అంశాలు ఉంటాయి. ఇవి తలనొప్పి, తలతిరగడం, వాంతులు , క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. దీంతో పాటు.. మామిడి పండ్లను త్వరగా పండించడానికి ఇథిలీన్ గ్యాస్, ఎథెఫాన్ వంటి రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఇవి కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి.
రసాయనాలతో పండించిన పండ్లను ఎలా గుర్తించాలి ?
తొక్క రంగు: మామిడి పండ్లు ఒకే రంగులో.. మెరుస్తూ కనిపిస్తే.. ఏదో తేడా జరిగిందని గుర్తించండి. రసాయనాలు లేకుండా పండిన మామిడికాయలపై చిన్న చిన్న మచ్చలు ఉంటాయి.
వాసనను గుర్తించండి: సహజంగా పండించిన మామిడిపండ్లు తీపి వాసనను కలిగి ఉంటాయి. రసాయనాలు ఉపయోగించి పండించిన మామిడిపండ్లు రసాయన వాసనను కలిగి ఉంటాయి.
బరువు , స్పర్శ: రసాయనాలతో పండించిన పండ్లు మృదువుగా , కుదించబడి ఉంటాయి. సహజంగా పండిన మామిడి పండ్లు కొంచెం గట్టిగా ఉంటాయి. మంచి బరువు కలిగి ఉంటాయి.
నల్లటి మచ్చలు: మామిడి పండ్లపై రంధ్రాలు లేదా నల్ల మచ్చలు ఉంటే.. అది రసాయనలు ఇచ్చిన ఇంజెక్షన్ గుర్తు కావచ్చు. అలాంటి మామిడి పండ్లు అస్సలు కొనకండి.
Also Read: సమ్మర్‌లో ఎండ వేడిని తట్టుకుని.. రిఫ్రెష్ అవ్వాలంటే ?
రుచి: మామిడిపండ్లు చేదుగా ఉంటే.. రసాయనాలతో పండించారని అర్థం.
నీటి పరీక్ష: మామిడిపండ్లను తీసుకుని ఒక బకెట్ నీటిలో వేయండి. మామిడిపండు మునిగిపోతే అది సహజంగా పండించారని అర్థం చేసుకోవాలి. అది తేలుతుంటే రసాయనాలతో పండినది కావచ్చు.
బేకింగ్ సోడా ట్రిక్: నీటిలో బేకింగ్ సోడా వేసి.. మామిడిపండును 15-20 నిమిషాలు నానబెట్టండి. మామిడి పండు రంగు మారితే.. దానిని రసాయనాలను ఉపయోగించి పండించారని అర్థం.