BigTV English

Treatment In Space: డాక్టర్లు లేని అంతరిక్షంలో వ్యోమగాములకు చికిత్స ఎలా? గుండె నొప్పి వస్తే ఏం చేస్తారు?

Treatment In Space: డాక్టర్లు లేని అంతరిక్షంలో వ్యోమగాములకు చికిత్స ఎలా? గుండె నొప్పి వస్తే ఏం చేస్తారు?

భారత వ్యోమగామి కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిశోధనలు, అంతరిక్ష యాత్రలు, అందులో భారత భాగస్వామ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లే వారిలో(యాత్రికులు మినహా), అందులోనూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో పరిశోధనలకోసం వెళ్లేవారిలో ఎవరూ డాక్టర్లు ఉండరు. అందరూ వ్యోమగాములు, స్పేస్ సైన్స్ తో మాత్రమే సంబధం ఉన్నవారిని మాత్రమే ఆ ప్రయోగాలకోసం ఎంపిక చేస్తారు. మరి అక్కడికి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురైతే ఏం చేస్తారు..? డాక్టర్ లేని సందర్భంలో వారికి వైద్యం ఎవరు అందిస్తారు..? పొరపాటున గుండెపోటు వస్తే సీపీఆర్ చేయడం సాధ్యమేనా..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.


క్రూ మెడికల్ ఆఫీసర్..
అంతరిక్షంలో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆస్పత్రి లేదా, ఎమర్జెన్సీ రూమ్ వంటివి ఏవీ ఉండవు. అయితే వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందే వారికి వైద్య పరమైన అత్యవసర పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. అవసరమైన వైద్య పరికరాలు ISSలో అందుబాటులో ఉంటాయి. ప్రతి మిషన్‌లో, ఒక వ్యోమగామిని ‘క్రూ మెడికల్ ఆఫీసర్’గా నామినేట్ చేస్తారు, వారికి మరింత ఎక్కువ శిక్షణ ఇస్తారు. అతని వద్ద సాధారణ నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్, అలెర్జీ మందులు, పోర్టబుల్ అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్, డీఫిబ్రిలేటర్, CPR కి అవసరమైన పరికరాలతో మెడికల్ కిట్ ఉంటుంది. వీటిని అవసరాన్నిబట్టి ఆయన వినియోగిస్తుంటారు.

CPR సాధ్యమేనా..?
అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల్లో ఎవరికైనా గుండెపోటు వస్తే ఏం చేస్తారు..? అత్యవసరంగా CPR చేయాల్సి వస్తే అది సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు అందరికీ వస్తుంటాయి. అయితే అంతరిక్షంలో ఉన్న ప్రత్యేక గురుత్వాకర్షణ పరిస్థితుల వల్ల CPR అనేది సాధ్యం కాదు. CPR చేసే సమయంలో గుండెపోటుకి గురైన వ్యక్తి ఛాతీని నొక్కాల్సి ఉంటుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి CPR చేయలేరు. అయితే CPR ఇవ్వడానికి కాళ్ళను కట్టడానికి ఒక ప్రత్యేక పరికరం అక్కడ ఉంటుంది. ఇక మరీ అత్యవసరం అయితే వెంటనే భూమిపైనుంచి NASA మిషన్ కంట్రోల్ సెంటర్ ద్వారా రియల్ టైమ్ వీడియోతో వైద్యులు కనెక్ట్ అవుతారు. టెలిమెడికల్ సహాయం అందిస్తారు. ISS నుండి అందుకున్న బయోమెట్రిక్ డేటా ఆధారంగా, వైద్యులు తగిన సూచనలు ఇస్తారు.


మరీ అత్యవసరం అయితే..
అక్కడున్న మందులు పనిచేయకపోయినా, టెలిమెడిసిన్ ద్వారా సహాయం సరిపోకపోయినా వెంటనే అనారోగ్యంతో ఉన్న వ్యోమగామిని భూమిపైకి పంపించే ఏర్పాట్లు చేస్తారు. దీనికోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో ఒక సోయుజ్ లేదా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అందుబాటులో ఉంటుంది. ఇది వ్యోమగామిని 3నుంచి 5 గంటల్లో భూమికి తీసుకుని రాగలదు. ఈ క్యాప్సూల్ కజకిస్తాన్ మైదానాల్లో ల్యాండ్ అయ్యేలా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. అక్కడ దిగిన క్యాప్స్యూల్ నుంచి వ్యోమగామిని వెంటనే NASA లేదా రష్యన్ స్పేస్ ఏజెన్సీ వైద్య కేంద్రానికి చేర్చుతారు. అయితే ఇది చిట్టచివరి ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే.. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన తర్వాత ఇక్కడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వ్యోమగామిపై ఉంటుంది. అంటే దాని ద్వారా వచ్చే మరిన్ని సమస్యలు వారిని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని చివరి ప్రయత్నంగా పిలుస్తారు.

 

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×