OTT Movie : ఓటీటీలో ఒక స్పై యాక్షన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో యాక్షన్ కంటెంట్ తో పాటు కామెడీ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ప్రపంచానికి ముప్పుగా మారే ఒక (AI) డివైస్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ స్పై యాక్షన్ కామెడీ మూవీ పేరు ‘Operation Fortune: Ruse de Guerre’ 2023లో విడుదలైన ఈ సినిమాకి గై రిచీ దర్శకత్వం వహించారు. ఇందులో జాసన్ స్టాథమ్, ఆబ్రీ ప్లాజా, జోష్ హార్ట్‌నెట్, కారీ ఎల్వెస్, బగ్జీ మలోన్, హ్యూ గ్రాంట్ నటించారు. 1 గంట 54 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.3/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ స్టోరీ ‘ది హ్యాండిల్’ అనే అత్యంత విలువైన టెక్నాలజీ డివైస్ కేంద్రంగా తిరుగుతుంది. దీనిని బ్రిటిష్ ప్రభుత్వం నుంచ్చ, ఉక్రేనియన్ మాఫియా గ్యాంగ్ దొంగలిస్తుంది. బిలియనీర్ ఆర్మ్స్ డీలర్ గ్రెగ్ సిమండ్స్ ద్వారా బ్లాక్ మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. ఈ హ్యాండిల్ ఒక అధునాతన కృత్రిమ మేధస్సు (AI) డివైస్. దీనికి ఏదైనా సెక్యూరిటీ సిస్టమ్‌ను హ్యాక్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ డివైస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నాథన్ జాస్మిన్ నేతృత్వంలో ఒక టీమ్‌ను నియమిస్తుంది. ఇందులో ఎలైట్, సారా, షార్ప్‌షూటర్ JJ డేవిస్ ఉంటారు.
ఈ టీమ్ హ్యాండిల్‌ను రిట్రీవ్ చేయడానికి ఒక సినిమా స్టార్ డానీ ఫ్రాన్సెస్కోను రిక్రూట్ చేస్తుంది. అతను సిమండ్స్‌కు ఇష్టమైన నటుడు. ఈ మిషన్‌లో సహాయం చేయడానికి వస్తాడు. ఇక ఈ టీమ్ ది హ్యాండిల్ అనే డివైస్‌ను తీసుకురావడానికి మాడ్రిడ్‌కు వెళుతుంది. అక్కడ సారా ఈ డివైస్ ఎక్కడ ఉందో గుర్తిస్తుంది. అయితే మరో ప్రత్యర్థి మైక్ ఈ డివైస్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల మిషన్ కష్టంగా మారుతుంది. ఆతరువాత స్టోరీ యాక్షన్ టర్న్ తెసుకుంటుంది. చివరికి ఈ టీమ్ AI డివైస్‌ను వెనక్కి తెస్తారా ? ఈ మిషన్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? ‘ది హ్యాండిల్’ ప్రపంచానికి ముప్పుగా మారుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఆన్సర్ షీట్ పై పెన్ పెడితే చేతులు నరికేసే దెయ్యం… చిన్న పిల్లలు చూడకూడని మూవీ