BigTV English

Methi Water: ఈ డ్రింక్ త్రాగితే.. చాలు ఆరోగ్య సమస్యలు రమ్మన్నా రావు తెలుసా ?

Methi Water: ఈ డ్రింక్ త్రాగితే.. చాలు ఆరోగ్య సమస్యలు రమ్మన్నా రావు తెలుసా ?

Methi Water: మెంతి గింజలను వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే ఒక మూలిక. ఇది రుచి, వాసనను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఇది తక్కువేమీ కాదు. మెంతి గింజల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ , విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరం యొక్క వివిధ విధులకు సహాయపడతాయి.


మెంతి గింజలను నీటిలో వేసి ఆ నీటిని త్రాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర నియంత్రణ , చర్మం , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెంతి నీటి యొక్క ప్రయోజనాలు :


జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: మెంతి నీటిలో జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా కడుపులో గ్యాస్ తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కునే వారు మెంతి నీటిని త్రాగడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.

బ్లడ్ షుగర్ కంట్రోల్: మెంతి నీటిలో గెలాక్టోమన్నన్ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.అంతే కాకుండా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చర్మ ఆరోగ్యం: మెంతి నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలు , ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా ,ఆరోగ్యవంతంగా చేస్తుంది.

హెయిర్ హెల్త్: మెంతి నీళ్లను వెంట్రుకలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకల మూలాలు బలపడతాయి. చుండ్రు తగ్గుతుంది . అంతే కాకుండా జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. మెంతి నీరు తీసుకోవడం వల్ల జుట్టుకు కూడా మేలు జరుగుతుంది.

గుండె ఆరోగ్యం: మెంతి నీటిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బరువు తగ్గడం: మెంతి నీరు ఆకలిని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అధిక కేలరీలను నిరోధిస్తుంది కాబట్టి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.  బరువు తగ్గాలని అనుకునే వారు ఈ డ్రింక్ త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఈజీగా బరువు కూడా తగ్గేందుకు అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

Also Read: వాల్‌నట్స్‌తో మెరిసే చర్మం.. ఎలాగంటే ?

పీరియడ్స్ పెయిన్ : మెంతి నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఋతు క్రమంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. అంతే కాకుండా తిమ్మిర్లను తగ్గించడంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

బాలింతలకు మేలు: మెంతి నీటిలో ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది పాలిచ్చే తల్లులకు పాలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది శిశువు బరువును పెంచడానికి కూడా దోహం చేస్తుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×