Big Shock to BRS: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరనున్నట్లు టాక్ వస్తోంది. రేపు బండి సంజయ్ సమక్షంలో మేయర్‌తో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారు.
2001 లో పార్టీ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్‌కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడుతూనే ఉన్నాయి. 2006 ఉపఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల మెజారిటీతో గెలిపించిన ఘటన కరీంనగర్ ప్రజలది. పలు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మంచి విజయాలను అందించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించిన విషయం తెలిసిందే. కానీ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మారత్రం కరీంనగర్‌లో గులాబీ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఇక్కడ బండి సంజయ్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథయంలోనే మేయర్ సునీల్ రావును బీజేపీలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో కీలక నేత అయిన సునీల్ రావు బీజేపీలోకి వెళ్లడం బీఆర్ఎస్‌ను కొంత కలవరపరుస్తోంది.
Also Read: INR to US Dollar: గుడ్ న్యూస్.. ఎట్టకేలకు 18 పైసలు పెరిగిన రూపాయి విలువ..
కరీంనగర్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 33 స్థానాలు, బీజీపే 13 స్థానాలు, ఎంఐఎం 8, ఇండిపెండెంట్ 6, కాంగ్రెస్ 0 గెలుచుకున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో 24 మంది కార్పొరేటర్లు ఉండగా.. బీజేపీలో 16 మంది, కాంగ్రెస్ 12 మంది, ఎంఐఎంలో 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు.